Off Beat

గుహ‌లో త‌ల‌కిందులుగా ప‌డి ప్రాణాలు కోల్పోయాడు.. దాన్ని అత‌ని స‌మాధిగా మార్చేశారు..

జాన్ ఎడ్వర్డ్ జోన్స్ అనే పర్వతోహకుడు 28 గంటల తర్వాత నట్టి పుట్టీ గుహలో విషాదకరంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన నవంబరు 24, 2009న జరిగింది. తన సోదరుడు జోష్‌తో కలిసి గుహలో అన్వేషిస్తున్నప్పుడు, జోన్స్ ప్రమాదవశాత్తూ ఒక ఇరుకైన సొరంగంలోకి ప్రవేశించాడు. అతను గుహ ప్రవేశ ద్వారం నుండి సుమారు 400 అడుగుల (120 మీ) దూరంలో ఉన్న 10 x 18 అంగుళాలు (25 x 46 సెం.మీ.)లో తలక్రిందులుగా చిక్కుకున్నాడు. ఆ ఇరుకు ప్రవేశద్వారం అసహజ కోణాల కారణంగా జోన్స్ ఒక్క ప్రతి కదలిక తీవ్ర గాయాన్ని కలిగించే లాగ ఉంది. వెంటనే ప్రభుత్వ రక్షణ బృందం స్పందించింది, అతనిని రక్షించడానికి వారి ప్రయత్నాలలో అధునాతన డ్రిల్ వ్యవస్థను ఉపయోగించారు. ఆ గృహ కఠిన శిలలు ఉండడంతో వారి ప్రయత్నలు ఏమి పలించలేదు. ఏ ఆదునిక వ్యవస్థ వారికి సహకరించలేదు.

జోన్స్ అన్నివెలికితీత పనులు నిష్ప్రయోజనం అయ్యాయి. సమయం గడుస్తున్నా ఏ పురోగతి కనిపించలేదు. అతని శరీరం తలకిందులుగా ఉండటం వల్ల అతని శరీరంపై దీర్ఘకాలం ఒత్తిడి ఏర్పడింది. జోన్స్ చివరికి గుండెపోటుకు గురి అయ్య‌ ప్రాణాలు వదిలాడు. పైకప్పును కూల్చివేయడానికి పేలుడు పదార్ధాలను కూడా ఉపయోగించారు. చివరకు అతని శరీరాన్ని పొందే ఎ ప్రయత్నం కూడా ఫ‌లించలేదు. అతని మృతదేహాన్ని గుహ నుండి బయటకు తీయడం చాలా కష్టం గా మారింది. మొత్తం 137 మంది జాన్‌ను రక్షించడానికి 27 గంటల పాటు కష్టపడ్డారు. కానీ ఖాళీ చేతులతో, విషాద హృదయాలతో విషాద స్థలాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. 26 ఏండ్ల జాన్ ఎడ్వర్డ్స్ జోన్స్‌కు అది తుది విశ్రాంతి స్థలంగా మిగిలిపోయింది.

man lost his life in caves they became his grave

గుహను శాశ్వతంగా మూసివేసేందుకు భూమి యజమాని జోన్స్ కుటుంబానికి మధ్య ఒక ఒప్పందం కుదిరింది, దానిని జోన్స్‌కు స్మారక చిహ్నంగా మార్చింది. ఒక వారం తర్వాత ప్రజా అధికారులు నట్టి పుట్టీ గుహను ప్రజలకు శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయించారు. అప్పటి నుంచి గుహ సీల్ చేయబడింది.

Admin

Recent Posts