చిట్కాలు

Cracked Heels : కాళ్ళ పగుళ్లతో బాధ పడుతున్నారా..? ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం ఉంటుంది..!

Cracked Heels : చలికాలం వచ్చిందంటే చాలు. చాలా మందికి కాళ్లు పగిలిపోతూ ఉంటాయి. కాళ్ళ పగుళ్లు తగ్గాలంటే, ఇలా చేయడం మంచిది. ఈజీగా, కాళ్ల పగుళ్లు సమస్య నుండి బయట పడొచ్చు. చాలామంది, కాళ్ల పగుళ్ల ని తగ్గించడం కోసం, రకరకాల లోషన్స్ ని వాడుతుంటారు. రకరకాల క్రిములు ని కూడా వాడుతుంటారు. ఇవి తగ్గాలంటే, ఇలా చేస్తే సరిపోతుంది. అయితే, ఏమైనా క్రీం కానీ లోషన్ వంటివి కానీ రాస్తే, కొంచెం తగ్గుతాయి. కాని తర్వాత మళ్ళీ మామూలే.

అలా కాకుండా, చిటికెలో చక్కగా తగ్గిపోవాలంటే, ఇలా చేయండి. చాలామందికి రెగ్యులర్ గా ఈ సమస్య ఉంటుంది. అటువంటి వాళ్ళు, ఈ సమస్య నుండి బయటపడడానికి, ఇలా చేయడం మంచిది. సహజమైన పద్ధతిలో కాళ్లు పగులు తగ్గాలంటే, ఇలా చేయండి. కొంతమందికి బాగా రక్తం కూడా వస్తూ ఉంటుంది. నడిస్తే నొప్పి కూడా ఉంటుంది. అయితే, కాళ్ళ పగుళ్లు తగ్గాలంటే, కాళ్ళకి ముందు కొబ్బరి నూనె రాయండి.

wonderful home remedy for cracked heels

ఆ తర్వాత వేడి నీళ్లు ఒక బకెట్లో తీసుకోండి. ఎంత వేడిని తట్టుకోగలుగుతారో, అంత వేడి వరకు తీసుకోవచ్చు. ఆ వేడినీళ్ళని కింద పెట్టుకొని, కాళ్లు అందులో పెట్టుకోండి. ఒక రెండు గంటల పాటు, కాళ్ళని అందులో నానబెట్టండి. కాళ్ళని నానబెట్టిన తర్వాత, ఒళ్ళు రుద్దుకునే స్టోన్ తో కానీ లేదంటే, బ్రష్ తో కానీ కాళ్ళని రుద్దండి. ఇలా చేయడం వలన డెడ్ స్కిన్ బయటికి వచ్చేస్తుంది. కొత్త స్కిన్ రావడానికి అవుతుంది.

ఇప్పుడు మీరు పాదాలకి కొద్దిగా కొబ్బరి నూనె కానీ లేదంటే కొంచెం నెయ్యిని కానీ రాయండి. ఇలా చేయడం వలన, పాదాలు స్మూత్ గా మారతాయి. అలానే, పాదాలు పొడిబారి పోకుండా ఉంటాయి. కాబట్టి ఇలా ట్రై చేయండి. బాగా ఎక్కువగా సమస్య ఉన్నట్లయితే, తగ్గడానికి కొంచెం ఎక్కువ సేపు పడుతుంది. అదే ఒకవేళ కనుక సమస్య లైట్ గా ఉంటే, త్వరగా తగ్గిపోతుంది.

Admin

Recent Posts