Hair Growth : ఇది రాస్తే 30 రోజుల్లోనే మీ జుట్టు చాలా పొడ‌వు పెరుగుతుంది..!

Hair Growth : న‌ల్ల‌టి, ఒత్తైన జుట్టును ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. కానీ ప్ర‌స్తుత కాలంలో జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లు అధికమ‌య్యి జుట్టు రాలిపోతోంది. అలాగే జుట్టు పెర‌గ‌డం కూడా ఆగిపోతోంది. చాలా మంది బ‌య‌ట ఎక్కువ‌గా తిరిగే వారికే జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లు వ‌స్తాయని అనుకుంటారు. కానీ ఇంట్లో ఉండే వారు కూడా జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. జుట్టు రాల‌డం అనేది మ‌నం వాడే నీటి మీద కూడా ఆధార‌ప‌డి ఉంటుంది. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా జుట్టు రాల‌డాన్ని ఆప‌లేక రాలిపోతున్న జుట్టును చూసి బాధ‌ప‌డుతున్న‌ వారు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఇంట్లోనే చాలా సుల‌భంగా తయారు చేసుకోగలిగిన‌ ఒక చిట్కాను వాడి జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చ‌ని సౌంద‌ర్య నిపుణులు చెబుతున్నారు.

ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి, అలాగే దీనిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని త‌యారు చేసుకోవ‌డానికి గాను మ‌నం ఆలివ్ నూనెను, శీకాకాయ పొడిని, గుడ్ల‌ను, పెరుగును ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల షీకాకాయ పొడిని వేయాలి. త‌రువాత అందులోనే రెండు టీ స్పూన్ల ఆలివ్ నూనెను, మూడు టీ స్పూన్ల పెరుగును, ఒక కోడి గుడ్డు మొత్తాన్ని వేయాలి. త‌రువాత వీటిని అన్నీ క‌లిసేలా బాగా క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల‌కు అంటేలా బాగా రాయాలి.

wonderful home remedy for Hair Growth
Hair Growth

ఈ మిశ్ర‌మం పూర్తిగా ఆరిన త‌రువాత గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి. ఈ చిట్కాను క్ర‌మం త‌ప్ప‌కుండా వారానికి రెండు సార్లు పాటించ‌డం వల్ల జుట్టు రాల‌డం త‌గ్గ‌డంతోపాటు జుట్టుకు సంబంధించిన ఇత‌ర స‌మ‌స్యలు కూడా త‌గ్గిపోతాయి. అంతేకాకుండా జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది. జుట్టు రాల‌డం మొద‌ల‌వ‌గానే అంద‌రూ మార్కెట్ లో దొరికే ర‌క‌ర‌కాల షాంపూల‌ను, కండిష్ న‌ర్ ల‌ను, నూనెల‌ను వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల ఫ‌లితం ఉండ‌క‌పోగా దుష్ప్ర‌భావాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇవి అధిక ధ‌ర‌ల‌తో కూడుకుని ఉంటాయి. క‌నుక జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల చాలా త‌క్కువ ఖ‌ర్చులో ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.

D

Recent Posts