Ringworm : మనల్ని వేధించే అనారోగ్య సమస్యల్లో చర్మ సంబంధిత సమస్యలు కూడా ఒకటి. మనలో చాలా మంది గజ్జి, తామర, దురదలు వంటి చర్మ సంబంధిత సమస్యలతో బాధపడే వారు కూడా ఉన్నారు. ఈ సమస్యలు ఎక్కువగా గాలి తగలకుండా బిగుతైన దుస్తులు ధరించడం వల్ల, అలాగే వ్యక్తిగత పరిశుభ్రతను పాటించకపోవడం వల్ల ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే ఇవి ఒకరి నుండి మరొకరికి కూడా వ్యాపిస్తాయి. ఈ చర్మ సంబంధిత సమస్యలు ఉన్న వారు ఉపయోగించిన సబ్బులను, కండువాలను ఇతరులు ఉపయోగించడం వల్ల వారు కూడా ఈ సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది.
వీటి బారిన పడిన వారి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఈ చర్మ సంబంధిత సమస్యలు శరీరంలో ఎక్కడైనా రావచ్చు. ముఖ్యంగా గాలి తగలని భాగాలైన చంకలు, తొడలు, గజ్జలు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. గజ్జి, తామర, దురదలు వంటి చర్మ సంబంధిత సమస్యలను ఇంటి చిట్కాలను ఉపయోగించి కూడా నయం చేసుకోవచ్చు. గజ్జి, తామర, దురదలు వంటి చర్మ సంబంధిత సమస్యలను నయం చేసే ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం మనం ఒక టీ స్పూన్ నవరత్న నూనెను, ఒక టీ స్పూన్ కర్పూరం పొడిని, ఒక టీ స్పూన్ పటిక పొడిని ఉపయోగించాల్సి ఉంటుంది.
ముందుగా ఒక గిన్నెలో నవరత్న నూనెను తీసుకుని అందులో పటిక పొడిని, కర్పూరం పొడిని వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు సమస్య ఉన్న భాగాల్లో చేత్తో లేదా దూదితో రాసుకోవాలి. అలాగే ఈ మిశ్రమాన్ని ఉపయోగించే ముందు సమస్య ఉన్న భాగాలను శుభ్రం చేసుకుని తడి లేకుండా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై రాసుకుని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా క్రమం తప్పకుండా వారం రోజుల పాటు పాటించడం వల్ల గజ్జి, తామర, దురదలు వంటి చర్మ సంబంధిత సమస్యలు పూర్తిగా నయం అవుతాయి. ఈ మిశ్రమాన్ని వాడిన మూడు రోజుల్లోనే మనం ఆయా సమస్యలు తగ్గు ముఖం పట్టడాన్ని చూడవచ్చు. ఈ విధంగా సహజసిద్ధంగా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండానే చాలా తక్కువ ఖర్చులో మనం గజ్జి, తామర, దురదల వంటి చర్మ సంబంధిత సమస్యల బారి నుండి బయట పడవచ్చు.
ఈ చిట్కాను పాటించడంతోపాటు వదులుగా ఉండే దుస్తులను ధరించాలి. రోజూ రెండు పూటలా స్నానం చేస్తూ ఉండాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తగ్గడంతోపాటు భవిష్యత్తులో రాకుండా ఉంటాయి.