Kalonji Seeds : కలోంజి.. ఈ విత్తనాల గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. వీటిని కూడా వంటల్లో మసాలా దినుసులుగా ఉపయోగిస్తూ ఉంటారు. కలోంజిని బ్లాక్ కుమిన్ సీడ్స్, ఫెన్నెల్ ప్లవర్, నిగెల్లా, నట్ మగ్ ఫ్లవర్, రోమన్ కొరియాండర్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆయుర్వేదంలో కలోంజిని విరివిరిగా ఉపయోగిస్తారు. జుట్టు నుండి పాదాల వరకు మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ కలోంజి మనకు ఉపయోగపడతుంది. దాదాపుగా 100 రకాల అనారోగ్య సమస్యలను నయం చేసే శక్తి ఈ కలోంజి గింజలకు ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
వీటిలో మన శరీరానికి అవసరమయ్యే మినరల్స్, విటమిన్స్ తోపాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. కలోంజి గింజలు యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో.. ముఖ్యంగా బరువు తగ్గడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. అధిక బరువుతో బాధపడే వారు ఈ కలోంజి గింజలను వాడడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. కలోంజి గింజలను ఉపయోగించి బరువు ఎలా తగ్గాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక కళాయిలో 5 నుండి 6 టీ స్పూన్ల కలోంజి విత్తనాలను తీసుకుని 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఈ విత్తనాలను జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసి బాగా కలపాలి. తరువాత ఈ నీటిని 5 నిమిషాల పాటు అలాగే కదిలించకుండా ఉంచాలి. తరువాత ఈ నీటిలో అర చెక్క నిమ్మరసాన్ని, ఒక టీ స్పూన్ తేనెను వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని ఉదయం పరగడుపున తాగాలి.
ఇలా ప్రతి రోజూ క్రమం తప్పకుండా రెండు వారాల పాటు తాగడం వల్ల క్రమంగా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. అంతేకాకుండా మనకు మార్కెట్ లో కలోంజి విత్తనాలు క్యాప్సుల్స్ రూపంలో కూడా లభ్యమవుతూ ఉంటాయి. వీటిని ఉపయోగించినా కూడా మనం బరువు తగ్గవచ్చు. అధిక బరువుతో బాధపడే వారు ఈ కలోంజి క్యాప్సుల్స్ ను రోజుకు రెండు చొప్పున గోరు వెచ్చని నీటితో తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుండి సులభంగా విముక్తి పొందవచ్చు.
ఇలా కలోంజి నీటిని తయారు చేసుకుని తాగడం వల్ల లేదా కలోంజి క్యాప్సుల్స్ ను వాడడం వల్ల బరువు తగ్గడంతోపాటు మనం ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ కలోంజి నీటిని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి కావల్సినంత శక్తి లభించి నీరసం, అలసట తగ్గు ముఖం పడతాయి. అధిక రక్తపోటుతోపాటు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. కలోంజి నీటిని తాగడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. ఈ విధంగా కలోంజి విత్తనాలను వాడడం వల్ల బరువు తగ్గడంతోపాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.