Home Tips

దోమల బాధ ఎక్కువగా ఉందా.. ఇలా చేయండి..!

చాలా గృహాల్లో దోమల బాధ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో ఈ దోమలు మరీ ఎక్కువగా ఉంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని చిన్నపాటి చిట్కాల‌ను పాటిస్తే చాలు. దోమ‌లు అధికంగా ఉంటే చాలా మంది మ‌స్కిటో రీపెల్లెంట్స్‌ను వాడుతుంటారు. కానీ వీటిని వాడ‌డం వ‌ల్ల శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అయితే ఇందుకు బ‌దులుగా ప‌లు స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటిస్తే చాలు.. దాంతో దోమ‌ల బెడ‌ద నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ముఖ్యంగా ఇంట్లో విపరీతంగా దోమలు ఉన్నట్టయితే టీ పొడిని ఒక పాత్రలో వేసి కాల్చితే ఆ ఘాటుకు దోమలు దూరమవుతాయి. అలాగే, పుదీనా మొక్కను ఓ కుండీలో నాటి ఇంట్లో పెట్టుకుంటే ఆ ఘాటుకు దోమలు పారిపోతాయి. పుదీనా వాస‌న దోమ‌ల‌కు న‌చ్చ‌దు. అందువ‌ల్ల ఈ మొక్క‌ల‌ను ఇంట్లో పెడితే దోమ‌లు ఈ మొక్క ద‌రిదాపుల్లోకి కూడా రావు.

follow these tips if you have mosquitoes in your home

ఒక గ్లాసు నిండా నీళ్లు పోసి అందులో కొన్ని కర్పూరం బిళ్ళలు వేస్తే వచ్చే వాసనకు కూడా దోమలు ఇంటి నుంచి పోతాయి. అదేవిధంగా దోమ కుడితే నొప్పి, దురదగా ఉన్న చోట వెనిగర్‌ అద్దిన దూదితో మృదువుగా రుద్దితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లి లేదా ఉల్లిపాయ వాస‌న కూడా దోమ‌ల‌కు న‌చ్చ‌దు. వీటి ర‌సాన్ని తీసి నీటిలో క‌లిపి ఒక బాటిల్‌లో పోసి స్ప్రే చేస్తుండాలి. దీంతో దోమ‌లు పారిపోతాయి. ఇంట్లో వేపాకుల‌తో పొగ వేస్తున్నా చాలు, ఆ వాస‌న‌కు దోమ‌లు ఉండ‌వు.

Admin

Recent Posts