పూర్వకాలంలో చాలా మంది మల విసర్జనకు బయటకే వెళ్లేవారు. అప్పట్లో చాలా మంది ఇండ్లలో టాయిలెట్లు ఉండేవి కావు. దీంతో అందరూ మల విసర్జనను బయటే కానిచ్చేవారు. తరువాత చాలా మందికి అవగాహన పెరిగింది. ఇండియన్ తరహా టాయిలెట్లను ఉపయోగించడం మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు కాలం మారడంతో చాలా మంది తమ ఇండ్లలో వెస్టర్న్ టాయిలెట్లను పెట్టించుకుంటున్నారు. బయట ఎక్కడికి వెళ్లినా ఈ తరహా టాయిలెట్లు మనకు దర్శనమిస్తున్నాయి. ఇవి పెద్దలకు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవారికి, అధిక బరువు ఉన్నవారికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. అయితే ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ వెస్టర్న్ టాయిలెట్లను ఉపయోగించడంలో మాత్రం చాలా మందికి సమస్య ఎదురవుతుంటుంది.
వెస్టర్న్ టాయిలెట్‌లో మల విసర్జన చేసిన తరువాత కడుక్కోవడం ఇబ్బందిగా మారుతుంది. ఆ టాయిలెట్‌లో ఉండే ఫ్లష్‌ను ఎలా వాడాలో చాలా మందికి తెలియడం లేదు. దీంతో ఫ్లష్‌ను వాడే సమయంలో మీద నీళ్లు పడుతుంటాయి. అయితే అలాంటి ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఎందుకంటే చిత్రంలో చూపించిన విధంగా చేస్తే చాలు. దాంతో వెస్టర్న్ టాయిలెట్‌ను ఎవరైనా సరే చాలా సులభంగా ఉపయోగించగలుగుతారు. అందుకు ఏం చేయాలంటే..
చిత్రంలో ఇచ్చినట్లుగా రెండు రకాలుగా వెస్టర్న్ టాయిలెట్ ఫ్లష్‌ను వాడవచ్చు. ఈ ఫ్లష్‌ను ముందు లేదా వెనుక పెట్టి నీళ్లతో కడుక్కోవచ్చు. అయితే ముందుగా కాస్త పైకి పెట్టాలి. అక్కడి నుంచి నెమ్మదిగా కిందకు రావాలి. ఇలా ముందు లేదా వెనుక వైపు నుంచి ఫ్లష్ వాడవచ్చు. దీంతో ఎంతో సులభంగా వాష్ అయిపోతుంది. చాలా ఈజీగా ఈ ఫ్లష్‌ను ఉపయోగించవచ్చు. కనుక ఇకపై వెస్టర్న్ టాయిలెట్‌ను వాడాల్సి వస్తే ఖంగారు పడకండి. ఇలా సులభంగా ఫ్లష్‌ను వాడేయండి.