సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుని చాలా రోజులు అవుతున్నా ఇప్పటికీ వీరి విడాకుల వ్యవహారం ఎక్కడో ఒక చోట, ఏదో ఒక సందర్భంలో వైరల్ అవుతూనే ఉంది. వీరి విడాకులకు ఇప్పటికీ ఎవరికీ సరైన కారణాలు తెలియవు. సమంత ప్రవర్తన నచ్చే చైతూ విడాకులు ఇచ్చాడని కొందరు అంటే.. కాదు.. చైతూనే ఇతర మహిళలతో అఫైర్స్ పెట్టుకున్నాడని, అందుకనే సమంత విడాకులు ఇచ్చిందని కొందరు అంటుంటారు. సమంతకు హెల్త్ ప్రాబ్లం ఉందని, కనుకనే ఆమె చైతూ నుంచి విడాకులు తీసుకుందని కూడా అంటుంటారు. ఇలా ఎవరికి తోచిన కారణాలను వారు చెబుతున్నారు కానీ వీరి విడాకులకు అసలు కారణాలు మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ తెలియవు. అయితే చైతూ నటించిన తండేల్ మూవీ తాజాగా రిలీజ్ అవగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో చైతూ తమ విడాకులపై సంచలన కామెంట్స్ చేశాడు.
సమంత, తాను ఒకరికొకరు ఎన్నో సార్లు మాట్లాడుకుని 1000 సార్లు ఆలోచించాకే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నామని, ఇందులో ఎవరి బలవంతం లేదని, ఇద్దరి పరస్పర అంగీకారంతోనే విడాకులను పొందామని తెలిపాడు. విడాకులు తీసుకున్న తరువాత నుంచి తమపై చాలా మంది అనేక రకాల కామెంట్లు చేస్తున్నారని అన్నాడు. ఇది తనను ఇప్పటికీ ఎంతగానో బాధిస్తుందని తెలిపాడు. విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నామని, ఇక ఈ విషయం ఇంతటితో వదిలేయాలని, తమ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని, తమకు ప్రైవసీ కల్పించాలని కోరాడు.
ప్రస్తుతం సమంత తన పని తాను చేసుకుంటుందని, అలాగే తను కూడా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నానని చైతూ తెలిపాడు. ఇకనైనా ఈ విషయాన్ని వదిలేయాలని కోరాడు. విడాకులు తీసుకోవడం వల్ల అందరూ తనను ఒక క్రిమినల్‌ను చూసినట్లు చూస్తున్నారని, ఇది తనను బాధిస్తుందని అన్నాడు. అయితే నాగచైతన్య ఈ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. పదే పదే వీరి విడాకుల విషయం తెరపైకి వస్తుండడంతోనే చైతూ ఆవేదనతో ఇలాంటి కామెంట్స్ చేశాడని అర్థమవుతోంది. ఇక ఆయన నటించిన తండేల్ మూవీకి పాజిటివ్ స్పందన లభిస్తోంది. లవ్, డ్రామా జోనర్లలో తెరకెక్కిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే లభిస్తోంది. మరోవైపు సమంత ప్రస్తుతం సినిమాలు ఏవీ చేయడం లేదు.