Home Tips

ఈ పండ్లను ఫ్రిజ్ లో పెడుతున్నారా.. ఇక ఆపండి.. బయట పెట్టడం మేలు..

సాధారణంగా మనం మార్కెట్ కి వెళ్లి వచ్చిన తర్వాత కూరగాయలు, పండ్లు, చిన్న చిన్న వస్తువులను ఫ్రిజ్ లో ఉంచుతాం. ఫ్రిడ్జ్ లో పెడితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి అని మనం భావిస్తాం. కానీ శాస్త్రవేత్తలు ఒక భయంకర విషయాన్ని బయటపెట్టారు. అది ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సాధారణంగా ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ అనేది తప్పనిసరి అయిపోయింది. ఇంట్లో ఉండే కుటుంబసభ్యులంతా ఫ్రిడ్జ్ పైన ఆధార పడతారు. పండ్లు కూరగాయలు ఇతర డ్రింక్స్ అందులో పెడుతూ ఉంటారు. ఫ్రిజ్ లో పెట్టడం వల్ల ఆహార పదార్థాలు ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉంటాయని, బయటి వాతావరణంలో ఉంచితే బయట వేడి వల్ల కొద్ది గంటలలోనే పాడవుతాయి అని అనుకుంటారు.

చాలామంది ఇంట్లో ఎక్కడా ప్లేస్ లేదనో, లేదంటే బయట పెట్టకూడదనో బయట పెట్టే వస్తువులు కూడా ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు. కానీ కొన్ని పండ్లను బయటపెట్టినా ఏబీ కాదు. అలాంటి వాటిని కూడా అందులోనే తోసి పడేస్తారు. పుచ్చకాయలు, మామిడి పండ్లు బయట వాతావరణం లోనే తాజాగా ఉంటాయి. వాటిని ఫ్రిజ్ లో పెట్టడం వలన వాటి రుచి స్వభావాన్ని కోల్పోతాయి. తర్వాత వాటిని తిన్నా అంతగా టేస్టీ ఉండదు. ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి పుచ్చకాయలను చాలామంది కోసిన తర్వాత ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు. దీనివల్ల దాని రుచి పోవడమే కాకుండా తొందరగా పాడవుతుంది.

this is why we do not need to put these fruits in fridge

ఒకవేళ తప్పనిసరిగా పెట్టాలి అనుకుంటే దానిపై ఒక కవర్ ను కప్పి అందులో పెట్టాలి. అలాగే మామిడికాయలను కూడా బయట నుంచి తెచ్చిన తరువాత కాసేపు చల్లటి నీటిలో వేసి సాధారణంగా రూమ్ టెంపరేచర్ లో ఉంచాలి. ఫ్రిజ్ లో పెట్టడం వల్ల దాని రుచి కూడా తగ్గిపోతుంది. రుచి ఎందుకు తగ్గుతుంది అంటే ఫ్రిడ్జ్ లో రకరకాల వాసనలు వస్తాయి. కొన్ని పండ్లకు నీటిని పీల్చుకునే గుణం అనేది ఉంటుంది. దీనివల్ల దాని రుచి మారుతుంది. కాబట్టి ఫ్రిజ్ లో తప్పనిసరిగా పెట్టాలి అనుకుంటే కవర్ తో కప్పి వాటిని అందులో పెట్టాలి.

Admin

Recent Posts