information

1.7 కోట్ల సిమ్ కార్డ్స్ బ్లాక్.. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం..!

భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రాడ్ మరియు స్పామ్ కాల్స్ విషయంలో ఇది నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1.77 కోట్ల ఫేక్ మొబైల్ కనెక్షన్స్ ని బ్లాక్ చేసినట్లు తెలిపింది. 34 లక్షల కనెక్షన్ క్రైమ్ కి పాల్పడినట్లు తెలుస్తోంది. ఎయిర్టెల్, జియో, వోడాఫోన్, ఐడియా, BSNL నకిలీ సిమ్ కార్డులను తొలగించారు. నకిలీ ఆధార్ కార్డులు, ఇతర పత్రాలను ఉపయోగించి ఈ సిమ్ కార్డులని జారీ చేశారు.

మోసం, స్పామ్ కాల్స్ నిరోధించడానికి భారత ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. ప్రభుత్వం బ్లాక్ చేసిన 1.77 కోట్ల నకిలీ మొబైల్ కనెక్షన్లలో 34 లక్షల కనెక్షన్స్ ని సైబర్ క్రైమ్ లో ఉపయోగించబడుతున్నాయని తెలుస్తోంది. వినియోగదారులు సిమ్ కార్డ్ వేరొకరి పత్రాలుపై జారీ చేయబడకుండా జాగ్రత్త వహించాలి. లేదంటే సిమ్ కార్డ్ కూడా బ్లాక్ చేయబడుతుంది.

1.7 crore sim cards are blocked know the reasons

అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త టెలికామ్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. కస్టమర్లు భద్రత అలాగే సౌలభ్యం కోసం నిబంధనలను రూపొందించబడ్డాయి. కొత్త నిబంధనల ప్రకారం నకిలీ పత్రం ద్వారా కనెక్షన్ల పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. 1.77 కోట్ల మొబైల్ కనెక్షన్స్ మూతపడ్డాయి. 71 వేల మంది సిమ్ ఏజెంట్లను కూడా ప్రభుత్వం బ్లాక్ చేసింది. నకిలీ పత్రాలపై జారీ చేసినందుకు AI సాధనాల సహాయంతో 1.77 కోట్ల మొబైల్ కనెక్షన్లను ప్రభుత్వం బ్లాక్ చేసింది. దీనితో పాటు నాలుగు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DOT) సహకారంతో 45 లక్షల నకిలీ అంతర్జాతీయ కాల్స్ ని నెట్‌వర్క్‌ లోకి ప్రవేశించకుండా నిరోధించారు.

Peddinti Sravya

Recent Posts