information

భారతీయ రైల్వేలో ఎరుపు, నీలం మరియు ఆకుపచ్చ కోచ్ లు ఎందుకు ఉన్నాయో మీకు తెలుసా..?

భారతదేశం నలుమూలల్లో రైల్వే వ్యవస్థ అనేది విస్తరించి ఉంది. ప్రతిరోజు ఈ రైళ్లలో ఎంతోమంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇందులో కొన్ని రైళ్లు వస్తువులను చేరవేస్తూ దేశ వ్యాప్తంగా రవాణా చేస్తాయి. అయితే భారతదేశంలో 1853లో ముంబై నుంచి థానే వరకు మొదటి రైలు నడిచింది. ఇక అప్పటి నుంచి రైల్వే వ్యవస్థ ముందుకు పోతూనే ఉంది. అయితే ప్రతి రోజూ ఎంతోమంది రైల్లో ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా రైళ్ల యొక్క రూపకల్పన వాటి రంగుల‌ గురించి ఏ ఒక్కరూ ఆలోచించి ఉండరు.. మరి రైలు ఎక్కువగా నీలం, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లోనే ఎందుకు ఉంటాయి. రైళ్లకు ఆ పెయింటింగ్ ఎందుకు వేస్తారు.. దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఓసారి చూద్దాం.

బ్లూ కోచ్ లు.. ఇండియన్ రైళ్లు చాలా వరకు నీలం రంగుతోనే పెయింట్ చేసి ఉన్నాయి. వీటినే ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అని పిలుస్తారు. ఇది తమిళనాడులో ఉంది. అంటే ఈ కోచ్ లు పుట్టింది తమిళనాడులో అని అర్థం. ఈ రంగు ఉన్న రైళ్లు గంటకు 70 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాయి. అయితే వీటిని 18 నెలలకు ఒకసారి తప్పనిసరిగా సరిదిద్దాలి. రెడ్ కోచ్ లు.. భారతదేశంలో ఈ మధ్యకాలంలో ఈ రెడ్ కలర్ రైళ్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. వీటిని ఎల్ హెచ్ బీ లేదంటే లింక్ హాఫ్మన్ బుష్ అని పిలుస్తారు. వీటిని పంజాబ్ లోని కపూర్తలా జిల్లా లో తయారుచేస్తారు. విశాఖ స్టీల్ తో తయారు చేయబడ్డాయి. వీటీలో డిస్క్ బ్రేక్ లు ఉండి గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ప్రమాదం జరిగినప్పుడు ఈ కోచ్ లు సెంటర్ బఫర్ కూలింగ్ సిస్టం కలిగి ఉన్నందున ఒకదానిపై ఒకటి పడవు.

do you know why these coaches colors were different

ఆకుపచ్చ కోచ్ లు.. ఈ కోచ్ లను ఎక్కువగా గరీబ్ రథ్ లో ఉపయోగిస్తారు. మీటర్ గేజ్ రైల్వే లో, కొన్ని బ్రౌన్ కోచ్ లు కూడా ఉన్నాయి. మరోవైపు లేతరంగు క్యారేజీ లను ఉపయోగిస్తారు. భారతదేశంలో దాదాపు అన్ని నగరాల్లో నారో గెజ్ రైళ్లను ఇప్పటికే బ్యాన్ చేశారు. దీనిపై రంగులను పక్కనపెడితే ప్రత్యేకమైన గీతలు ఉన్నాయి. కొన్ని కోట్ల చివరి విండో మీద వేర్వేరు రంగులు చిత్రించారు. ఈ విధంగా రైళ్లను గుర్తు పట్టేందుకు ఇండియన్ రైల్వే ఈ విధమైనటువంటి చిహ్నాలను ఉపయోగిస్తోంది. కానీ ప్రస్తుత కాలంలో జెట్ స్పీడ్ తో వెళ్లే రైళ్లు వస్తే వాటిని ఏ విధంగా డిజైన్ చేస్తారో మనం ఊహించలేం.

Admin

Recent Posts