రైలు బండిని నడిపేది “పచ్చ జెండా” అయితే, మన బతుకు బండిని నడిపేది “పచ్చ నోటు”! పైసా లో పరమాత్మఉందనుకుంటాము. “వేదం” సినిమాలో చెప్పినట్టు జేబులో నుండి జేబులలోకి ఎగిరే కాగితమే రూపాయి. గతంలో ప్రధాని మోడీ 500 , 1000 నోట్లు బాన్ చేసి నోటు కష్టాలు చూపించారు. పది రూపాయల నోటు నుండి రెండు వేల రూపాయల నోటు వరకు అన్నిటి మీద “గాంధీ” ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ఎప్పుడు తీసింది? అసలు గాంధీ ఫోటో నోటు మీద ఎప్పటినుండి అచ్చు వేశారు? నోటు కథ ఏంటో చూడండి!
నోటు పై “గాంధీ” బొమ్మ డ్రాయింగ్ వేసింది కాదు. ఒక అజ్ఞ్యాత ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో. “గాంధీ” నవ్వుతూ “లార్డ్ ఫ్రెడ్రిక్ లారెన్స్” పక్కన నించునప్పుడు తీసిన ఫోటో అది. ఫ్రెడ్రిక్ లారెన్స్, బ్రిటిష్ రాజకీయ నాయకుడు. బ్రిటన్ లో మహిళా శ్రేయస్సు కోసం పోరాడారు. భారత- బర్మా కి సెక్రటరీ గా కూడా పనిచేసారు! 1946 లో “గాంధీ” “ఫ్రెడ్రిక్” ని కలిసినప్పుడు ఒక జర్నలిస్ట్ తీసిన ఫోటో అది. వైస్రాయ్ హౌస్ (ఇప్పుడు రాష్ట్రపతి భవన్) దగ్గర తీసిన ఫోటో అది. ఆ ఫొటోలో “గాంధీ” ని క్రాప్ చేసి మిర్రర్ ఫోటో చేసి నోటు పై అచ్చు వేశారు!
1987 లో మొదట 500 నోటు పై “గాంధీ” ఫోటో ముద్రించారు. 1996 నుండి అన్ని నోట్ల పై గాంధీ ఫోటో అచ్చు వేయడం ప్రారంభమయ్యింది. అంతకు ముందు నోటు పై “అశోక స్థంభాలు” ఉండేవి! 1996 లో 500 రూపాయల నోటు రూపు రేఖలు మార్చారు. ఇప్పుడు 2016 లో 500 , 2000 రూపాయల నోట్లపై మిర్రర్ ఫోటో ఉపయోగించకుండా ఒరిజినల్ ఫోటో ఉపయోగించారు!