information

క్రెడిట్ కార్డు వాడేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు….

<p style&equals;"text-align&colon; justify&semi;">క్రెడిట్ కార్డ్… ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కంపల్‌సరీ ఉంటున్న కార్డు&period; 12 వేలకు పైగా జీతం ఉంటే చాలు&comma; ప్రతి బ్యాంక్ క్రెడిట్ కార్డును ఆఫర్ చేస్తోంది&period; బ్యాంక్ వాళ్లు ఇస్తున్నారని… అవసరమైన సమయంలో ఉపయోగపడుతుందని చాలా మంది క్రెడిట్ కార్డులను తీసుకుంటున్నారు&period; అయితే క్రెడిట్ కార్డును ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారా&period; క్రెడిట్ కార్డ్ లావాదేవీలలో మీరు చేసే చిన్న పొరపాటుకి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది&period; క్రెడిట్ కార్డు అసలు ఎలా వాడాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం&period; కరెంట్ బిల్లు&comma; క్రెడిట్ కార్డు బిల్లు గడువులోగా చెల్లించకుండా తర్వాత ఫైన్ తో కట్టడం చాలా మంది చేసే మొదటి పొరపాటు&period; కరెంట్ బిల్లు ఫైన్ తో కట్టినా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు… కానీ క్రెడిట్ కార్డుకు ఫైన్ తో పాటు సిబిల్ స్కోర్ తగ్గిపోయే ప్రమాదం ఉంది&period; ఒక్కసారి గడువులోగా బిల్లు చెల్లించకపోతే స్కోర్ 80-110 పాయింట్లు పడిపోయే ప్రమాదం ఉంది&period; బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డు చెల్లింపు గడువు లోగా చెల్లిస్తున్నారా లేదా అనేది పరిశీలిస్తుంటారు&period; ఎప్పుడైనా బ్యాంక్ లోన్ తీసుకునేటప్పుడు క్రెడిట్ కార్డు రీపేమెంట్ కూడా చెక్ చేస్తారు&period; అందుకే క్రెడిట్ కార్డు బిల్లును గడువు లోగా చెల్లించడం అలవాటు చేసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్యాంక్ ఎంత లిమిట్ ఇస్తే అంత వాడుకుంటూ ఉంటారు చాలా మంది&period; మీరు మొత్తం లిమిట్ వాడుకున్నా బ్యాంకులు ఎలాంటి అడ్డు చెప్పవు&period; కానీ క్రెడిట్ స్కోర్ ఇచ్చే సంస్థలు మాత్రం మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో ను పరిశీలిస్తారు&period; అంటే మీకు ఇచ్చిన లిమిట్ లో ఎంత వాడుకుంటున్నారు అనేది చెక్ చేస్తారు&period; మీకు లక్ష రూపాయలు లిమిట్ ఇస్తే 30-40 శాతం మాత్రమే వాడుకోవాలి అలా కాదని మొత్తం వాడినా… మీ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది&period; అందుకే మీరు కార్డు తీసుకొన్నప్పుడే 30-40 శాతం వాడుకునేలా ఒక లిమిట్ పెట్టుకోండి&period; ఫ్లిప్ కార్ట్&comma; అమెజాన్&comma; పేటీఎం లాంటి ఆన్లైన్ షాపింగ్ సంస్ధలు క్రెడిట్ కార్డు లావాదేవీలపై ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి&comma; నో కాస్ట్ ఈఎంఐ అని కనపడగానే చాలా మంది ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటారు&period; కేవలం రూ&period; 10 వేల రూపాయల ఫోన్ కొన్నా కూడా ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటారు&period; ఇలా చెయ్యడం వల్ల మీరు తక్కువ మొత్తాన్ని కూడా ఒకేసారి కొనలేరేమో అనే భావన వస్తుంది&period; ఇది కూడా మీ స్కోర్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86885 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;credit-card&period;jpg" alt&equals;"if you have a credit card know these 8 important facts " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రెడిట్ కార్డుతో నగదు విత్ డ్రా చేసే సౌకర్యం ఉంటుంది&period; కానీ ఇందుకోసం క్యాష్ అడ్వాన్స్ ఫీజ్ 3&period;5 శాతం చెల్లించాల్సి వస్తుంది&period; దీంతో పాటు కొన్ని కొన్ని బ్యాంకులు మరిన్ని ఛార్జీలు వేస్తాయి&period; అందుకే క్రెడిట్ కార్డుతో నగదు విత్ డ్రా చెయ్యడం అలవాటు చేసుకోకండి&period; క్రెడిట్ కార్డు వాడే వాళ్లకి క్రెడిట్ స్కోర్&comma; క్రెడిట్ రిపోర్ట్ గురించి తెలియదు&period; క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేసుకోవచ్చన్న విషయం కూడా తెలియదు&period; అన్ లైన్ లో క్రెడిట్ రిపోర్ట్ ను ఉచితంగా చెక్ చేసుకోవచ్చు&period; క్రెడిట్ కార్డు రిపోర్ట్ చెక్ చేసుకోవడం వల్ల మనం చేసే తప్పులు ఏంటో మనకు తెలుస్తాయి&period; దీంతో ఆ తప్పులు మరోసారి చేసే ఆస్కారం ఉండదు&period; మీరు క్రెడిట్ కార్డు అప్లై చేసేటప్పుడే మీ క్రెడిట్ రిపోర్ట్ కోసం బ్యాంకులు అప్లై చేస్తాయి&period; ఇలా పదే పదే బ్యాంకులు మీ క్రెడిట్ రిపోర్ట్ కోసం అప్లై చెయ్యడం కూడా క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం చూపుతాయి&period; మీరు తక్కువ సమయంలో లోన్లు&comma; క్రెడిట్ కార్డులు అప్లై చెయ్యడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది&period; ఒకసారి క్రెడిట్ కార్డు రిజక్ట్ అయితే మళ్లీ కొన్ని రోజులు తర్వాతే మళ్లీ అప్లై చెయ్యండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది క్రెడిట్ కార్డు ఉపయోగిస్తారు కానీ వాటికి వచ్చే రివార్డ్ పాయింట్స్ గురించి పెద్దగా పట్టించుకోరు&period; అలా రెండు మూడేళ్లు రివార్డ్ పాయింట్స్ వాడుకోకపోతే ఎక్స్ పైరీ అవుతాయి&period; దీనివల్ల మీకు రావాల్సిన అదనపు ప్రయోజనాలను కోల్పోతారు&period; అందుకే రివార్డ్ పాయింట్స్ రీడీమ్ చేసుకుని అదనపు లాభాలు పొందండి&period; చాలా మంది పాత క్రెడిట్ కార్డులను క్యాన్సిల్ చేసుకుని ఆఫర్ల కోసం కొత్త కార్డులను తీసుకుంటారు&period; కానీ… బ్యాంకులు మాత్రం మీరు ఎంత కాలం నుంచి కార్డులు వాడుతున్నారు అనేది చూస్తాయి&period; మీ దగ్గర ఎక్కువ కాలం ఒకటే కార్డు ఉంటే మీకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి&period; దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts