information

LIC Jeevan Anand Policy : LIC లో రూ.45 పొదుపు చేస్తే రూ.25 ల‌క్ష‌లు పొంద‌వ‌చ్చు.. ఎలాగంటే..?

LIC Jeevan Anand Policy : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (LIC) దేశంలోనే అత్యంత సుర‌క్షిత‌మైన‌, న‌మ్మ‌ద‌గిన బీమా సంస్థ‌గా పేరుగాంచింది. LIC లో చాలా మంది వినియోగ‌దారులు ఉన్నారు. LIC దేశంలోని ప్ర‌జ‌ల కోసం అనేక బీమా ప‌థ‌కాల‌ను అందిస్తోంది. అయితే వాటిల్లో LIC జీవ‌న్ ఆనంద్ పాల‌సీ కూడా ఒక‌టి. దీంట్లో మీరు రూ.45 పొదుపు చేస్తే చాలు, మెచూరిటీ తీరాక ఏకంగా రూ.25 ల‌క్ష‌లు పొంద‌వ‌చ్చు. ఇక ఇది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

LIC జీవ‌న్ ఆనంద్ పాల‌సీని ట‌ర్మ్ పాల‌సీగా చెప్ప‌వ‌చ్చు. ఇందులో నాలుగు ర‌కాలు ఉంటాయి. యాక్సిడెంట‌ల్ డెత్‌, డిసేబిలిటీ రైడ‌ర్‌, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడ‌ర్‌, న్యూ ట‌ర్మ్ ఇన్సూరెన్స్ రైడ‌ర్‌, న్యూ క్రిటిక‌ల్ బెనిఫిట్ రైడ‌ర్ అనే ర‌కాలు ఉంటాయి. అయితే ఇన్సూరెన్స్ తీసుకున్న వ్య‌క్తి దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఏ కార‌ణం చేత అయినా చ‌నిపోతే అత‌ని నామినీకి 125 శాతం డెత్ బెనిఫిట్ ల‌భిస్తుంది. కానీ ఈ పాల‌సీపై ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్ ల‌భించ‌దు.

LIC Jeevan Anand Policy full details and benefits

పాల‌సీ ట‌ర్మ్ క‌నీసం 15 ఏళ్లు..

18 నుంచి 50 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న‌వారు ఎవ‌రైనా స‌రే LIC జీవ‌న్ ఆనంద్ పాల‌సీని తీసుకోవ‌చ్చు. ఈ పాల‌సీ మెచూరిటీ ఏజ్ 75 ఏళ్లు. పాల‌సీ ట‌ర్మ్ క‌నీసం 15 ఏళ్లుగా ఉంది. గ‌రిష్టంగా 35 ఏళ్లు క‌ట్ట‌వ‌చ్చు. ఈ పాల‌సీ తీసుకుంటే ప్రీమియంను మీరు నెల‌కు ఒక‌సారి లేదా 3 నెల‌ల‌కు ఒకసారి, 6 నెల‌ల‌కు లేదా ఏడాదికి ఒక‌సారి క‌ట్ట‌వ‌చ్చు. ఈ పాల‌సీని మీరు వ‌ద్ద‌నుకుంటే 2 ఏళ్లు ఆగాలి. మీరు గ‌న‌క ఈ పాల‌సీకి గాను 2 ఏళ్లు పూర్తి ప్రీమియం చెల్లించి ఉంటే అప్పుడు పాల‌సీని వ‌ద్దు అనుకుంటే మీరు ఈ పాల‌సీని స‌రెండ‌ర్ చేయ‌వ‌చ్చు. మీకు స‌రెండ‌ర్ వాల్యూ లేదా దానికి స‌మాన‌మైన స్పెష‌ల్ వాల్యూను రిట‌ర్న్ ఇస్తారు. ఇలా ఈ పాల‌సీ ప‌నిచేస్తుంది. 2 ఏళ్లు పూర్తి అయిన త‌రువాత ఈ పాల‌సీపై లోన్ కూడా తీసుకోవ‌చ్చు.

మీరు రూ.5 ల‌క్ష‌ల‌కు గాను LIC జీవ‌న్ ఆనంద్ పాల‌సీని తీసుకుంటే అప్పుడు మీరు ఏడాదికి రూ.16,300 ప్రీమియం చెల్లించాలి. ఇది నెల‌కు రూ.1358 అవుతుంది. రోజుకు రూ.45 అవుతుంది. ఈ క్ర‌మంలో మీరు ప్ర‌తి ఏడాది రూ.16,300 క‌డుతూ వెళ్తే 35 ఏళ్ల‌కు ఆ మొత్తం రూ.5,70,500 అవుతుంది. 35 ఏళ్ల త‌రువాత మీకు ఇన్సూరెన్స్ మొత్తం రూ.5 ల‌క్ష‌లు, రూ.8.50 ల‌క్ష‌లు బోన‌స్‌, రూ.11.50 ల‌క్ష‌లు అద‌న‌పు బోనస్ క‌లిపి ఇస్తారు. దీంతో మీకు మొత్తం రూ.25 ల‌క్ష‌లు మెచూరిటీ అనంత‌రం వ‌స్తాయి. ఇలా ఈ ప‌థ‌కంలో రూ.45తో ఏకంగా రూ.25 ల‌క్ష‌లు పొంద‌వ‌చ్చు. ఈ పాల‌సీ తీసుకుంటే యాక్సిడెంట్‌, డెత్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. క‌నుక మీరు ఇలాంటి పాల‌సీ కోసం గ‌నుక చూస్తుంటే వెంట‌నే LIC వారిని సంప్ర‌దించండి. దీంతో అనేక లాభాలు పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts