information

Post Office Scheme : రోజుకు రూ.167 పెడితే.. రూ.16 లక్షలు మీవే..!

Post Office Scheme : పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల స్కీములని అందిస్తోంది. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో డబ్బులు పెట్టడం వలన, ఏ ఇబ్బందీ ఉండదు. మంచిగా ప్రాఫిట్ ఉంటుంది. రిస్క్ లేకుండా, అదిరే రాబడి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ లో, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) కూడా ఒకటి. PPFలో ఇన్వెస్ట్ చేయడం వల్ల, ఎలాంటి ఇబ్బంది ఉండదు. సూపర్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం చూస్తున్న వారికి, ఈ స్కీము బాగుంటుంది. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే, రోజుకి రూ.167 పెడితే సరిపోతుంది.

ఈ స్కీము కి సంబంధించి మరిన్ని వివరాలు చూస్తే… రోజుకి రూ.167 పెడితే చాలు. కేవలం నెలకు 5,000 రూపాయలు పెడితే చాలు. 15 సంవత్సరాల తర్వాత, మీకు డబ్బులు వస్తాయి. మెచ్యూరిటీ తర్వాత 16 లక్షల రూపాయలు వస్తాయి. కావాలంటే మీరు స్కీము ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కూడా. ప్రస్తుతం పీపీఎఫ్ స్కీమ్‌పై 7.1 శాతం వడ్డీ రేటు వస్తోంది. స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో ఇతర పథకాలతో పోలిస్తే ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు.

post office ppf scheme you can get good amount after 15 years

ఈ స్కీము మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. 15 ఏళ్ల పాటు డబ్బులు పెట్టాల్సి వుంది. ఆ తర్వాత మీ డబ్బులు మీకు వెనక్కి వస్తాయి. అవసరం అనుకుంటే మెచ్యూరిటీ కాలాన్ని ఐదేళ్ల చొప్పున పెంచుకోవచ్చు. అలానే, పీపీఎఫ్ అకౌంట్ మీద లోన్ ని కూడా, పొందడానికి అవుతుంది. ఈ స్కీము వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతూ ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి, వడ్డీ రేట్లను మారుస్తుంది. పోస్టాఫీస్ లేదా బ్యాంక్‌కు వెళ్లి పీపీఎఫ్ ఖాతా తెరవొచ్చు. ఏడాది లో రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. రూ.500 డిపాజిట్ చేసినా కూడా మీ అకౌంట్ ని కొనసాగించవచ్చు.

Admin

Recent Posts