information

NPS Vatsalya Scheme : చిన్నారుల కోసం కొత్త ప‌థ‌కం.. ఇందులో ఏడాదికి రూ.10వేలు పెడితే ఎంత వ‌స్తుందంటే..?

NPS Vatsalya Scheme : దేశంలో ఉన్న పౌరుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు డ‌బ్బును పొదుపు చేసుకునేందుకు అనేక ప‌థ‌కాల‌ను ప్ర‌వేశపెడుతూనే వ‌స్తోంది. అందులో భాగంగానే పౌరుల‌కు ఇప్ప‌టికే ఎన్నో కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. అయితే చిన్నారుల కోసం గ‌తంలోనే కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో కొత్త పొదుపు ప‌థ‌కాన్ని ప్రవేశ‌పెట్టింది. ఎన్‌పీఎస్ వాత్స‌ల్య పేరిట ఈ స్కీమ్ ప్రారంభం అయింది. ఇందులో భాగంగా చిన్నారుల పేరిట డ‌బ్బును పొదుపు చేయ‌వ‌చ్చు. దీంతో వారికి 18 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వ‌చ్చే స‌రికి ఆ మొత్తం చాలా ఎక్కువ అవుతుంది. దాన్ని విత్ డ్రా చేసి వారి చ‌దువులు లేదా వ్యాపారం లేదా ఇత‌ర అవ‌స‌రాల‌కు ఉప‌యోగించుకోవ‌చ్చు.

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ఎన్‌పీఎస్ వాత్స‌ల్య యోజ‌న ప‌థ‌కంలో త‌ల్లిదండ్రులు లేదా పిల్ల‌ల‌కు చెందిన తాత‌, బామ్మ వంటి వారు త‌మ పిల్ల‌ల పేరిట ఖాతా తెర‌వ‌వ‌చ్చు. అయితే వారి వ‌య‌స్సు 18 ఏళ్ల లోపు ఉండాలి. ఇక ఈ ప‌థ‌కంలో ఏడాదికి రూ.1000 క‌నీసం పొదుపు చేయాలి. గ‌రిష్టంగా ఎంతైనా పొదుపు చేయ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం ఎన్‌పీఎస్ ప్ర‌కారం అయితే ఈ స్కీమ్‌కు 12.86 స‌రాస‌రి రిట‌ర్న్స్ వ‌స్తాయి. అంటే పిల్ల‌ల పేరిట నెల‌కు రూ.1000 ని 18 ఏళ్ల పాటు పొదుపు చేస్తే అప్పుడు పెట్టిన మొత్తం రూ.2.16 ల‌క్ష‌లు అవుతుంది. దీనికి గాను 12.86 శాతం వ‌డ్డీని లెక్కిస్తే అప్పుడు ఆ మొత్తం రూ.6,32,718 అవుతుంది. దీంతో పిల్ల‌వాడికి 18 ఏళ్లు నిండే స‌రికి ఆ మొత్తం రూ.8.48 ల‌క్ష‌లు అవుతుంది.

what is NPS Vatsalya Scheme full details

80 శాతాన్ని యాన్యుటీ ప్లాన్‌కు బ‌ద‌లాయిస్తారు..

ఈ విధంగా ఎన్‌పీఎస్ వాత్స‌ల్య యోజ‌న స్కీమ్ ప‌నిచేస్తుంది. అయితే పెట్టిన మొత్తం రూ.2.50 ల‌క్ష‌ల‌కు లోపు ఉంటే పిల్ల‌వాడికి 18 ఏళ్లు నిండాక ఆ మొత్తం తీసుకోవ‌చ్చు. అలా కాకుండా పెట్టిన మొత్తం రూ.2.50 ల‌క్ష‌ల‌పైన ఉంటే అందులో 80 శాతం మొత్తాన్ని యాన్యుటీ ప్లాన్‌కు మారుస్తారు. మిగిలిన 20 శాతం మొత్తాన్ని అంద‌జేస్తారు. ఈవిధంగా ఈప‌థ‌కం ప‌నిచేస్తుంది. ఇక ఆ 80 శాతం మొత్తం రెగ్యుల‌ర్ ఎన్‌పీఎస్ ప‌థ‌కం అవుతుంది. అది వారు రిటైర్ అయ్యే వ‌ర‌కు కొన‌సాగుతుంది. లేదా అవ‌స‌రం అనుకుంటే మ‌ధ్య‌లో ఆపేయ‌వ‌చ్చు.

ఇక ఈ ప‌థ‌కాన్ని కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని పీఎఫ్ఆర్‌డీఏ నిర్వ‌హిస్తుంది. క‌నుక ఇందులో ప్ర‌జ‌లు తాము పొదుపు చేసే డ‌బ్బుకు పూర్తి స్థాయిలో ర‌క్ష‌ణ ఉంటుంది. అయితే పిల్ల‌వాడికి 18 ఏళ్లు రాక ముందు వ‌ర‌కు ఈ ప‌థ‌కంలో మొత్తం 3 సార్లు డ‌బ్బును అత్య‌వ‌స‌ర ప‌నుల‌కు ఉప‌యోగించ‌వ‌చ్చు. ఈ విధంగా ఎన్‌పీఎస్ వాత్స‌ల్య యోజ‌న ప‌థ‌కం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. త‌ల్లిదండ్రుల‌కు కూడా పిల్ల‌ల భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను తీర్చేందుకు ఈ ప‌థ‌కం ప‌నిచేస్తుంది. క‌నుక ఇందులో పెట్టుబ‌డి పెట్టాల‌నుకునేవారు అకౌంట్‌ను తెర‌వ‌వ‌చ్చు.

Admin

Recent Posts