information

గజిటెడ్ అధికారులు సంతకాలు కేవలం గ్రీన్ ఇంకు పెన్ తోనే ఎందుకు చేస్తారు కారణం ఏమిటి ?

ఇండియాలో ఆకుపచ్చ సిరా ఉపయోగించేందుకు ఎటువంటి ప్రోటోకాల్ కానీ, చట్టం కానీ లేదు. ఇది కేవలం ఆఫీస్ హెడ్ తన ర్యాంక్ కంటే తక్కువ అధికారి నుండి వేరు చేయడానికి ఈ రంగు సిరాని ఎంపిక చేసుకుంటారట. ఆకుపచ్చ ఇంక్ పెన్నులను ఉపయోగించడం వెనుక ఉన్న అతిపెద్ద కారణం ఏంటంటే? ఎవరైనా కార్యాలయంలో వారి సంతకాన్ని కాపీ చేయడం కష్టం. ఆకుపచ్చ సిరా సంతకాలు ప్రత్యేకతను, ప్రామాణికతను కలిగి ఉంటాయని అయినా అవి ఫోర్జరీ అయ్యే అవకాశం ఉందని ఆన్ లైన్ చర్చలో చాలామంది అభిప్రాయపడ్డారు.

సాంకేతిక సిబ్బంది, భోదనా సిబ్బంది, వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది. గ్రంథాలయ సిబ్బందికి కూడా గెజిటెడ్ హోదా ఉంది. ఒకప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు గెజిటెడ్ ఆఫీసర్లుగా ఉంటే ఇప్పుడు స్కూలు హెడ్ మాస్టర్, గవర్నమెంట్ డాక్టర్ వంటి వారు కూడా గెజిటెడ్ ఆఫీసర్లు అయ్యారు.

why gazetted officer sign with green ink

వీరు వివిధ అప్లికేషన్ల కోసం సమర్పించిన పత్రాలు అసలైన కాపీగా ధృవీకరించే బాధ్యతను కలిగి ఉంటారు. ఒకప్పుడు గెజిటెడ్ ఆఫీసర్లు ఎరుపురంగు వాడేవారట. ఇప్పుడు కొందరు ఐఏఎస్‌లు మామూలు రంగు పెన్నులే వాడుతున్నారు. ప్రభుత్వం ఫలానా రంగు ఇంకు పెన్నులతో సంతకం పెట్టాలని ఎటువంటి నియమాలను మాత్రం విధించలేదు.

Admin

Recent Posts