information

Crossed Cheque : చెక్కుపై రెండు లైన్లు ఎందుకు గీస్తారు..? దాని వెనుక కారణం ఏమిటంటే..?

Crossed Cheque : ఈరోజుల్లో క్యాష్ పేమెంట్లు బాగా తగ్గిపోయాయి. డిజిటల్ యుగం ఇప్పుడు నడుస్తోంది. ప్రతి ఒక్కరు కూడా, ఆన్లైన్లో డబ్బులుకి పంపిస్తున్నారు. అలానే, ఆన్లైన్లోనే ఇతరులనుండి డబ్బులని పొందుతున్నారు. ఈ రోజుల్లో చాలామంది, క్యాష్ ని అసలు డ్రా చేయట్లేదు. ఆన్లైన్ లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు, ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. అలానే చెక్కులు కూడా కొంతమంది ఇస్తూ ఉంటారు. బ్యాంకులకి సంబంధించిన విషయాలు క్రాస్డ్ చెక్ మొదలైన వాటికి సంబంధించిన విషయాలని, కచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎగువ ఎడమ మూలలో తరచుగా రెండు లైన్లు కనబడుతూ ఉంటాయి.

ఈ రెండు ముఖ్యమైన అర్ధాన్ని కలిగి ఉంటాయి. క్రాస్డ్ చెక్ ని ఇది సూచిస్తుంది. క్రాస్డ్ చెక్ అనేది ముందు జాగ్రత్త చర్య. చెక్కు నుండి డబ్బు నగదు కాకుండా నేరుగా చెల్లింపుదారి ఖాతాలో జమ చేయబడింది నిర్ధారిస్తుంది. మోసాలు ఏవి కూడా జరగకుండా అడ్డుకుంటుంది. ఆర్థిక లావాదేవీల, భద్రతను ఇది పెంచుతుంది. చెక్ క్రాస్ అయినప్పుడు ఖాతా చెల్లింపుదారు చెక్కుగా పరిగణింపబడుతుంది. చెక్కు పై రాయబడిన వ్యక్తి యొక్క బ్యాంక్ ఖాతాకి మాత్రమే డబ్బులు జమ చేయిబడతాయి.

why two lines on cheque what is the meaning

డబ్బులు దొంగతనం చేయడం, మోసాలు వంటివి జరగకుండా ఇది చూస్తుంది. అలానే, ఏ ప్రమాదం కూడా జరగకుండా, సురక్షితంగా డబ్బులని పంపడం జరుగుతుంది. అనధికారిక వ్యక్తులు చెక్కుని, వారి సొంత ఖాతాలలో నగదుగా మార్చుకోకుండా లేదంటే జమ చేయకుండా ఆపేందుకు, ఈ లైన్ యొక్క ప్రాముఖ్యత చాలా ముఖ్యం. ఖాతా చెల్లింపుదారునిగా పేర్కొనడం ద్వారా నిధులు ఉద్దేశించిన గ్రహీతకు, సురక్షితంగా చేరేలా జారీ చేసే వాళ్ళు, నిర్ధారిస్తారు.

ఇలా చెక్కు పై రెండు లైన్లు ఎందుకు గీస్తారో అన్న విషయం 90% మందికి తెలియదు. చెక్కు పై రెండు లైన్లకి అర్థం ఇది. ఇటువంటి విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. పైగా ఇటువంటి విషయాలు మీరు తెలుసుకున్నట్లైతే, ఇతరులతో కూడా చెప్పుకోండి. వాళ్ళకి కూడా ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి.

Admin

Recent Posts