హెల్త్ టిప్స్

Turmeric Side Effects : పసుపుని ఎక్కువగా తీసుకుంటే.. ఈ సమస్యలు తప్పవు.. రోజూ ఎంత వరకు తీసుకోవచ్చంటే..?

Turmeric Side Effects : పురాతన కాలం నుండి, పసుపు కి ఉన్న విశిష్టత ఇంతా అంతా కాదు. పసుపు ని వంటల్లో వాడడం మొదలు ఔషధాలలో ఇలా రకరకాల వాటి కోసం, మనం పసుపుని వాడుతూ ఉంటాము. ఈరోజుల్లో, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండడం కోసం, పూర్వీకులు పాటించే పద్ధతుల్ని కూడా అలవాటు చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా, పసుపుని ఎక్కువగా వాడుతున్నారు. సరైన మోతాదులో తీసుకుంటే, ఏ సమస్యలు ఉండవు. కానీ, పసుపుని మోతాదుకు మించి వాడినట్లయితే, కొన్ని సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. పసుపులో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి.

వాటికోసం, ప్రత్యేకించి చెప్పుకోక్కర్లేదు. మార్కెట్లో దొరికే పసుపు కంటే కూడా, పసుపు కొమ్ములను పొడి చేసుకుని వాడితే మంచిది. వీటి వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. పసుపును సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉంటాయి. అదే మీరు మోతాదుకి మించి తీసుకున్నట్లయితే, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. ఎక్కువగా పసుపుని వాడడం వలన, ఎలర్జీలు వచ్చే ఛాన్స్ ఉంది. పిత్తాశయం పనితీరు మందగించి, పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.

excessive turmeric consumption is not good for health

అలానే, రక్తస్రావం సమస్యలు ఉన్నట్లయితే, పసుపును తీసుకుంటే, ఈ సమస్య ఎక్కువవుతుంది. కాలేయం పనితీరు మందికించి, పచ్చకామెర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. పసుపుని ఎక్కువగా వాడడం వలన, కొంతమందిలో చర్మం పై దద్దుర్లు, దురద వంటివి కలుగుతాయి. గర్భధారణ సమయంలో కూడా, పసుపుని తీసుకోవడం మంచిది కాదు. పిండంపై ప్రభావం చూపుతుంది.

శరీరంలో పసుపు మోతాదు ఎక్కువ అయితే, రక్తంలో ఉండే తెలుపు, ఎరుపు రక్త కణాలకి ఈ ముప్పు కలుగుతుంది. పసుపులోని కర్క్యుమిన్ అనే పదార్థం ఉంటుంది. రక్తాన్ని పల్చగా మారుస్తుంది. పసుపుని ఎక్కువగా తీసుకోవడం వలన, రక్తం పలుచగా మారిపోతుంది. పసుపు ఎక్కువ తీసుకుంటే గ్యాస్టిక్ సమస్యలు కూడా వస్తాయి. డయేరియా, మలబద్ధకం వంటి సమస్యలు కలుగుతాయి. రోజుకి రెండు గ్రాముల కి మించి పసుపును తీసుకోవద్దు.

Admin

Recent Posts