inspiration

ఎన్ని సార్లు చెత్త వేసినా తీస్తారు వీళ్లు.. శుభ్రంగా ఉండేదాకా విడిచిపెట్ట‌రు.. ఎంతో మందికి ఆద‌ర్శం..

తేజస్వి ది ఒంగోలు, తండ్రి వ్యాపారి, తల్లి గృహిణి, వారికి ఆమె ఒక్కతే కూతురు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఒక పత్రికలో ఒంగోలు చాలా వెనుకబడి ఉందని చాలా బాధపడింది. అందుకు కారణాలేమిటని శోధిస్తే అపరిశుభ్రత ఎక్కువని తెలిసింది. తన వంతుగా ఏమైనా చేయగలడా అని ఆలోచించింది. అందుకు సొంతంగా ఒక ఫౌండేషన్‌ను ప్రారంభించింది. పదిమంది స్నేహితులతో కలిసి ఒంగోలులో భూమి ఫౌండేషన్‌ను ప్రారంభించింది. పట్టణాన్ని స్వచ్చంగా మార్చాలన్న లక్ష్యంతో శుభ్రం చేసిన ప్రాంతాలకు రంగులు వేసి స్ఫూర్తి నినాదాలు రాయడం ప్రారంభించింది. చూసిన వాళ్లు దాగుందని మెచ్చుకున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో శుభ్రం చేసినా చెత్త వేసేవారు. పోస్టర్లు అంటించేవారు.

అధికారుల దృష్టికి తీసుకువెళితే మొదట్లో వట్టించుకున్నారు. తరువాత అది కరువైంది. ఎన్నిసార్లు చెత్త వేసినా తిరిగి శుభ్రం వేయడం చేసేవాళ్ళు. దాంతో కొన్నాళ్లకు చెత్త వేయడం మానేశారు. రంగులు వేసిన చోట్ల చక్కటి ముగ్గులు వేసి పూలమొక్కలు పెట్టారు. కొంతమంది పోకిరీలు వాటిని పగులగొట్టేవారు. అయినా మళ్లీ పెట్టేవారు. కొన్ని విసుగువచ్చి అసలు ఈ పనిని ఆపేయాలనుకున్నామని తేజస్వి అంది. ప్రతికూల పరిస్థితిలోనే సానుకూలత వెతుక్కోవాలని తండ్రి రెప్పడంతో తన బృంద సభ్యులే తన బలంగా సమస్యలను ప్రజలకు తెలియజేయాలనుకుంది. సంస్థ పేరుతో ఫేస్‌బుక్ పేజ్‌లో లైవ్ పెట్టింది. అది కాస్త వైరల్ అయింది. ఒక్కరోజుబోనే యాభైవేల వ్యూస్ వచ్చాయి.

this group cleans cities and becoming inspiration to all

మరుసటి రోజు అధికారుల నుండి ఫోన్లు కూడా వచ్చాయి. కేరళలో వరదలు వచ్చినప్పుడు తేజస్వి బృందం కొంత సహాయాన్ని అందించింది. ఒంగోలు, దాని చుట్టుపక్కల దాదాపు 120 ప్రాంతాల శుభ్రం చేశారు. అలాగే హైదరాబాద్‌లోనూ వీరి సేవలు ప్రారంభించారు. వదిమందితో ప్రారంభమైన వీరి సంస్థలో ప్రస్తుతం మూడు వేలకు పైగా సభ్యులున్నారు. తేజస్వి బృందం చేస్తున్న పనులే వారికి గుర్తింపు తెచ్చాయి. వారి రాష్ట్ర ప్రభుత్వం నుండి మూడుసార్లు స్వచ్ఛ ఆంధ్ర పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్ లో ఆవార్డు అందుకున్నారు. టెక్ మహీంద్రాలో ఉద్యోగం చేస్తున్నా తేజస్వి తన సంస్థ పనులు నిత్యం పర్యవేక్షిస్తుంటుంది. సంస్థ చేస్తున్న పనులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడే అవకాశాన్ని కల్పించింది. ఇది తనకో మధుర జ్ఞాపకం అంటుంది. తేజస్వి ఒంగోలును స్పూర్తిగా తీసుకోండి అని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న మాటలు తనకు సేవ చేయాలనే స్పూర్తిని పెంచాయంటుంది.

Admin

Recent Posts