హెల్త్ టిప్స్

అదిక బ‌రువును సింపుల్‌గా త‌గ్గించుకోవాల‌ని చూస్తున్నారా.. అయితే ఇలా చేయండి..

ఆధునిక కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అందుకే చాలామంది బరువు తగ్గడానికి ఎక్సర్‌సైజ్‌లతోపాటు ఏవేవో డైట్లు పాటిస్తుంటారు. ఈ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి… ఎలాంటి ఆహారం తినకూడదు అనే విషయంలో తరచుగా గందరగోళానికి గురవుతుంటారు. ఇలాంటి వారు.. ఎలాంటి శ్రమ లేకుండానే వంటగదిలో ఉన్న వాటితో బరువు తగ్గొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఊబకాయాన్ని అదుపులో ఉంచే వాటిలో ఉల్లిపాయలు ఒకటి.. ఉల్లి పాయల‌ను రోజూ తీసుకుంటే వారంలోనే బరువు తగ్గొచ్చని పేర్కొంటున్నారు. సాధారణంగా ఉల్లిపాయలను కూరల్లో, సలాడ్లలో ఉపయోగిస్తుంటారు. అయితే నేరుగా ఉల్లిపాయలు తినడం ద్వారా చాలా వేగంగా బరువు తగ్గుతారని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. మరి ఉల్లిపాయలతో ఎలా బరువు తగ్గవచ్చో ఇప్పుడు తెలుసుకోండి..

ఉల్లిపాయ ఫైబర్ మంచి మూలం. 1 కప్పు ఉల్లిపాయలో 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అందువల్ల రోజువారీ ఆహారంలో ఉల్లిపాయలను చేర్చుకోవడం చాలా మంచిది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉల్లిపాయలలో ఉండే కరిగే ఫైబర్ తినాలన్న కోరికలను తగ్గిస్తుంది. బరువు తగ్గించే ప్రయాణంలో అతిగా తినకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఉల్లిపాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 1 కప్పు తరిగిన ఉల్లిపాయలో 64 కేలరీలు మాత్రమే ఉంటాయి. అందువల్ల బరువు తగ్గించే ప్రయాణంలో వీటిని తప్పనిసరిగా తినాలని పేర్కొంటున్నారు. ఉల్లిపాయల్లో స్థూలకాయాన్ని నిరోధించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఉల్లిపాయ క్వెర్సెటిన్ సమ్మేళనంలో స్థూలకాయం నిరోధక లక్షణాలున్న ఫ్లేవనాయిడ్ ఉంటుంది. ఇది ఉశరీరానికి ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తారు.

this is how you can use onion for weight loss

ఉల్లిపాయ ర‌సాన్ని తయారు చేయడానికి, ఒక చిన్న ఒలిచిన ఉల్లిపాయతో 1 కప్పు నీటిని మరిగించి.. మెత్తగా చేసుకోండి. చల్లారిన తర్వాత 1 కప్పు నీరు వేసి కలపండి. ఈ రసాన్ని ఒక గ్లాసులో పోసి తాగాలి. అలాగే ఒక గిన్నెలో 1 స్పూన్ నూనె, 2 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించాలి. దీని తర్వాత మీకు నచ్చిన విధంగా, లేకపోతే 2 తరిగిన ఉల్లిపాయలు, 1/2 కప్పు కూరగాయలను జోడించండి. 2-5 నిమిషాలు తిప్పుతూ ఉడికించాలి. ఉప్పు, మిరియాలు, తగినన్ని నీళ్లు వేసి 20 నిమిషాలు ఉడికించాలి. చల్లారిన తర్వాత ఉల్లిపాయ సూప్ తాగండి. ఉల్లిపాయను వేయించి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ ఉల్లిపాయను వెనిగర్‌ నీటిలో వేసి కాసేపు ఉంచండి.. వీటిని సలాడ్‌గా తీసుకోండి.

Admin

Recent Posts