international

భారత బ్రహ్మోస్ కు, పాకిస్తానీ CM400 AKGకు మ‌ధ్య ఉన్న తేడాలు ఏమిటంటే..?

భారత్ దాడి ఎందుకు సక్సెస్ అయ్యింది? పాకిస్తాన్ దాడి ఎందుకు fail అయ్యింది అనేది సాంకేతిక కోణంలో పరిశీలిద్దాం. భారత్ ఉపయోగించిన బ్రహ్మోస్ ని cruise missile అంటారు.Sea skimming, terrain hugging path అంటారు. అంటే , భూమికి 10 మీటర్ల‌ ఎత్తులో ప్రయాణం చేయగలదు. ఏమైనా అడ్డువచ్చినా, అవసరం మేరకు తప్పించుకుని, మార్గాన్ని మార్చుకుని ప్రయాణించగలదు. కాబట్టి, అది ప్రయాణించే మార్గాన్ని అంచనా వేయడం కష్టం. అన్నింటికీ మించి, అది సంప్రదాయమైన రాడార్ కళ్ళను తప్పించుకుంటూ ప్రయాణిస్తుంది. red color wave క్రింద ఏదైనా విమానం, మిస్సైల్ వెళితే రాడార్ చూడలేదు (దానికి ప్రత్యేకమైన రాడార్ లు కావాలి). అందుకనే బ్రహ్మోస్ చాలా రాడార్ లను తప్పించుకుని తన లక్ష్యాన్ని చేరుకుంది.

పాకిస్తాన్ మన మీద ప్రయోగించింది CM400. అది ballistic మిసైల్. దాని మార్గాన్ని అంచనా వేయడం తేలిక. అంతే కాదు ballistic మిసైల్ దాని ప్రయాణం మధ్య‌లో చాలా పైకి వెళ్ళి క్రిందికి రావడం చేస్తుంది. ఆ సమయం లో మామూలు రాడార్లు కూడా దాన్ని స్పష్టం గా చూడగలవు. పాకిస్తాన్ ప్రయోగించిన మిస్సైల్ కన్నా వేగమైన మిస్సైల్ మన దగ్గర ఉండటం వల్ల ధ్వంసం చేయగలిగాము. మనకి వచ్చే ప్రశ్న….. అప్పుడు పాకిస్తాన్ కూడా క్రూజ్ మిసైల్ వాడవచ్చు కదా? ballistic మిసైల్ తెలిసి ఎందుకు వాడటం? క్రూజ్ మిసైల్ కి ఒక ఇబ్బంది ఉంది. అవి నిదానం గా వెళ్తాయి. Sub sonic ( super sonic వేగం ఉండదు) కాబట్టి నిదానం గా వెళ్ళే దాన్ని కూల్చడం తేలిక, ఎంత నిదానం అంటే, యుద్ద విమానం దానికన్నా రెండు రెట్లు వేగం గా వెళ్లగలదు. పైగా S400 తో పాటు వచ్చిన stealth, low altitude రాడార్ లు కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి cruise మిసైల్ ని పాకిస్తాన్ మన మీద వాడలేదు.

what are the differences between indian and pakistani missiles

బ్రహ్మోస్ ప్రత్యేకత, క్రూజ్ missile కి ప్రథమంగా super sonic వేగం ఇచ్చిన ఏకైక దేశం రష్యా. మన బ్రహ్మోస్ మాత్రమే ( రష్యా variants కాకుండా) super sonic వేగంతో వెళ్ళే ఏకైక క్రూజ్ మిసైల్ ప్రపంచంలో మ‌న ద‌గ్గ‌ర, ర‌ష్యా ద‌గ్గ‌ర ఉన్నాయి. చైనా కూడా తన దగ్గర ఆ సాంకేతికత ఉంది అంటుంది. కానీ అది తెలియ‌దు. కొన్ని సందర్భాలలో బ్రహ్మోస్ కేవలం 10 సెకండ్స్ రియాక్షన్ time ఇస్తుంది. అంటే, పాకిస్తాన్ బ్రహ్మోస్ వస్తుంది అని గుర్తించి, track చేసి, lock చేసి, ధ్వంసం చేయడం ఇవన్నీ 10 సెకండ్స్ లో చేయగలిగితేనే సక్సెస్ అవుతారు లేకపోతే అడ్డుకోలేరు. పాకిస్తాన్ వాడుతున్న HQ9 SAM reaction time ( target కనపడిన దగ్గర నుంచీ) 12 to 15 seconds.

2022 లో మన బ్రహ్మోస్ 124 కిలోమీటర్లు, 3 నిమిషాల 44 సెకండ్స్ పాటు పాకిస్తాన్ లో ప్రయాణించింది ( వ్యూహాత్మక ప్రయాణం optimal flight path లో వెళ్లలేదు). అలా వెళితేనే పాకిస్తాన్ దాన్ని ధ్వంసం చేయలేకపోయింది ( అప్పుడు HQ 9 SAM system ఉన్నా కూడా). ఇంతకీ పాకిస్తాన్ కి ఈ SAM ఇచ్చిన చైనా కూడా భారత్ తో ఉన్న బోర్డర్ లో S 400 SAM ని మోహరించింది వారి HQ9 కన్నా ప్రముఖ స్థానం ఇచ్చి. ప్రస్తుతం అమెరికా దగ్గర కూడా సూపర్ sonic వేగం తో వెళ్ళే cruise missile లేదు ( develop చేస్తుంది).

Admin

Recent Posts