Chanakya Niti : చాణక్య చెప్పినట్లు చేయడం వలన, జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మన జీవితాన్ని అందంగా మార్చుకోవచ్చు. ఆచార్య చాణక్య మన జీవితంలో ఎదురయ్యే, ప్రతి సమస్య గురించి కూడా చక్కగా వర్ణించడం జరిగింది. చాణక్య చెప్పినట్లు చేస్తే, కచ్చితంగా మార్పు ఉంటుంది. చాణక్య ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నాయని తెలియజేసే సంకేతాల గురించి చెప్పారు. చాలామందికి, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలని ఉంటుంది. కొన్ని కొన్ని లక్షణాలు, కొన్ని కొన్ని ఇబ్బందులు లేదంటే కొన్ని కొన్ని ఎదురయ్యే పరిస్థితులు బట్టి, మనం మన భవిష్యత్తును తెలుసుకోవచ్చు.
చాణక్య ఇలాంటి సంకేతాలు కనబడితే, ఆర్థిక ఇబ్బందులు మీరు త్వరలో ఎదుర్కోబోతున్నారని, భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు వస్తాయని చెప్పారు. లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగే విధంగా ప్రవర్తిస్తే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని చాణక్య అన్నారు. పైగా ఎంత సంపాదించినా, చేతిలో డబ్బు నిలవద్దని చాణక్య చెప్పారు. చాణక్య ప్రకారం కుటుంబంలో ఎప్పుడూ గొడవలు ఉన్నట్లయితే, ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నట్లు దానికి సంకేతం.
లక్ష్మీదేవి ఇటువంటి ఇంట్లో ఉండదు అని చాణక్య చెప్పారు. త్వరలోనే ఆర్థిక సమస్యలు కలుగుతాయి అని చాణక్య అన్నారు. తులసి మొక్క ఎండిపోవడం కూడా ఆర్థిక ఇబ్బంది కలగబోతోందని సూచన. తులసి మొక్కని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా చూస్తారు. సనాతన ధర్మంలో, తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి ఇంట్లో, తులసి మొక్క ఉండాలి. తులసి మొక్క ఎండిపోతే, లక్ష్మీదేవి అసంతృప్తి కలుగుతుంది.
కనుక, తులసి మొక్క ఎండి పోతే, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అలానే, గాజులు పగిలిపోవడం కూడా ఆర్థిక ఇబ్బందుల్ని సూచిస్తుంది. కొంతమంది కి, రాత్రి పూట నిద్ర పట్టదు. నిద్ర లేకపోవడం జరుగుతుంది. నిద్ర పోతే చెడు కలలు, పీడకలలు వంటివి వస్తూ ఉంటాయి. చెడు సంకేతంగా దీనిని చూడాలని చాణక్య అన్నారు. ఇది జరిగితే కూడా, లక్ష్మీదేవి వెళ్ళిపోతుందట. అలానే, పాలు పదేపదే విరిగి పోతుంటే కూడా లక్ష్మీదేవి వెళ్ళిపోతున్నట్లు. ఆర్థిక ఇబ్బందులు త్వరలో వస్తాయట.