Sai Pallavi : సాయి పల్లవి మళయాళంలో ప్రేమమ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో అచ్ఛమైన మళయాళీగా నటించి ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకుంది. అలాగే తెలుగు ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి అచ్చమైన తెలంగాణ అమ్మాయిగా నటించి తెలుగువారి మనస్సుల్లో స్థానం సంపాదించింది. మిడిల్ క్లాస్ అబ్బాయిలోనూ నానికి జోడీగా చలాకీగా నటించి అందరినీ మెప్పించి సినిమా హిట్ విషయంలో తనదైన ముద్రను వేసింది. గత కొంత కాలంగా ఈమె పెళ్లి చేసుకుంటుందనే వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి.
ఇక సాయిపల్లవి తన ముఖానికి ఎలాంటి క్రీమ్‌లు, పౌడర్‌లు రాసుకోదు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలియజేసింది. అప్పట్లో ఆమె నటించిన కణం అనే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సాయిపల్లవి తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తనను మేకప్ వేసుకోకుండానే నటించాలని ఆల్ఫోన్స్ పుతెరిన్ చెప్పాడని.. అందుకనే ప్రేమమ్ దర్శకుడి సూచన మేరకు అప్పటి నుంచి తాను మేకప్ వేసుకోవడం లేదని తెలిపింది.
ఇక సహజంగా నటించమని ఆయనే ప్రోత్సహించినట్లు వెల్లడించింది. ఆల్ఫోన్స్ తోపాటు తాను పనిచేసిన దర్శకులందరూ తన ఆత్మవిశ్వాసం పెరగడానికి దోహదపడ్డారని తెలియజేసింది. అందుకనే అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం పెంచడానికి తాను మేకప్ లేకుండా నటిస్తున్నానని వివరించింది. ఇక సాయిపల్లవి సౌందర్య సాధన ఉత్పత్తులకు చెందిన ఎలాంటి యాడ్స్‌లోనూ నటించడం లేదు. ఎన్ని కోట్లు ఇచ్చినా సరే తాను ఆ యాడ్స్ చేయనని స్పష్టంగా చెప్పేసింది. కనుకనే ఆమె అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు.