lifestyle

దానాల‌లో ఎన్ని ర‌కాలు ఉన్నాయో తెలుసా..? దానం చేసేట‌ప్పుడు ఏం చేయాలి..?

దానం చేస్తే పుణ్యం వస్తుందని పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అన్న విషయం మనకి తెలుసు. అయితే కేవలం అన్నదానమే కాదు. వస్తుదానం, డబ్బుని దానం చేయడం ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. దానం మొత్తం ఐదు రకాలు. అవి ఏంటంటే ధర్మం, అర్థం, భయం, కామం, కారుణ్యం. వీటివలన దాతకి కీర్తి, పరలోకంలో ఉత్తమ గతి కలుగుతాయి. ఎప్పుడూ అసూయ లేకుండా దానం చేస్తే దానిని ధర్మదానం అంటారు.

యాచకులు ప్రశంసిస్తూ ఉండగా ఇచ్చినప్పుడు దానిని అర్థదానం అంటారు. దానం ఇవ్వకపోతే ఏం చేస్తారు అనే భయంతో దానం చేస్తే దానిని భయధానం అంటారు. ఇష్టమైన వ్యక్తికి కనుక ఏమైనా ఇస్తే దానిని కామదానం అంటారు. జాలితో దానం చేస్తే కారుణ్య దానం అంటారు. అయితే ఎప్పుడూ కూడా పేద వాళ్ళకి ఇష్టంతో దానం చేయాలి. గుళ్లో హుండీలో వేసే డబ్బు కంటే యాచకులకి ఇవ్వడం వలన పుణ్యఫలం ఉంటుంది.

do you know about these 5 types of donations do you know about these 5 types of donations

ఎప్పుడైనా ఎవరికైనా దానం చేస్తే దానిని చెప్పకూడదు. రహస్యంగా ఉంచాలి. అందరికీ తెలియాలని అస్సలు ఆలోచించకూడదు. ఎప్పుడైనా కూడా చేసిన దానాన్ని వెంటనే మర్చి పోవాలి. దానం చేసినప్పుడు మనకి ఇష్టమైన దేవునికి అర్పితం ఇస్తూ కృష్ణార్పితమస్తు అని చెప్పుకోవాలి. ఇలా చేస్తే పుణ్యం బాగా వస్తుంది. చాలామంది పది రూపాయలు దానం చేస్తే 10 మందికి చెప్పుకుంటూ ఉంటారు.

దాని వలన దానం ఫలితం ఉండదు. ఎప్పుడూ కూడా దానం చేసేటప్పుడు ప్రతిఫలం ఆశించి దానం చేయకూడదు. అలా ఆశించినట్లయితే దానం చేసినా ఫలితం దక్కదు. స్వార్ధాలు లేకుండా ప్రేమగా మనస్ఫూర్తిగా దానం చేస్తే దానం యొక్క ఫలితం దక్కుతుంది. మనసులో ఎలాంటి కోరికలు, ఆశలు లేదంటే ఆలోచనలు, స్వార్థం ఇవేమీ లేకుండా దానం చేస్తే దానం చేసిన ఫలితం మీకు లభిస్తుంది. లేదంటే ఏ ఫలితం ఉండదు.

Admin

Recent Posts