ప్ర‌శ్న - స‌మాధానం

Banana During Pregnancy : గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌లు అర‌టి పండ్ల‌ను తిన‌వ‌ద్దంటారు.. ఎందుకు..?

Banana During Pregnancy : పురాత‌న కాలం నుంచి హిందువులు అనేక సంప్ర‌దాయాల‌ను, ఆచార వ్య‌వ‌హారాల‌ను పాటిస్తూ వ‌స్తున్నారు. అయితే వీటిలో కొన్ని సైన్స్‌తోనూ ముడిప‌డి ఉంటాయి. అందువ‌ల్ల మ‌న పెద్ద‌లు ఏదైనా చెబితే దాన్ని కొట్టి పారేయ‌కూడ‌దు. అందులో సైన్స్ ఏముంది.. అని ఆలోచించాలి. ఒక‌వేళ అప్ప‌టికీ ఏమీ తేల‌క‌పోతే దాన్ని కొట్టిపారేయ‌వ‌చ్చు. కానీ చాలా వ‌ర‌కు పురాణాలు, పెద్ద‌లు చెప్పిన విష‌యాల్లో మాత్రం ఎంతో కొంత సైన్స్ దాగి ఉంటుంద‌న్న విష‌యం మాత్రం వాస్త‌వం. ఇక సైన్స్‌తో ఎలాంటి సంబంధం లేకున్నా ఒక విష‌యాన్ని మాత్రం బాగా ప్ర‌చారంలోకి తెచ్చారు. అదేమిటంటే..

గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌లు అనేక ర‌కాల ఆహారాల‌ను తింటుంటారు. అయితే వారు తిన‌కూడ‌ని ఆహారాలు కూడా కొన్ని ఉంటాయి. కానీ కొంద‌రు మ‌హిళ‌లు మాత్రం అర‌టి పండ్ల‌ను తిన‌రు. గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌లు అర‌టి పండ్ల‌ను తిన‌కూడ‌ద‌ని వారు చెబుతారు. అందుక‌నే అర‌టి పండ్ల‌ను ఆ స‌మయంలో తీసుకోరు. అయితే పురాణాల‌లో ఈ విష‌యం ఎక్క‌డా లేద‌ని పండితులు చెబుతున్నారు. కానీ ఆయుర్వేదం ప్ర‌కారం అయితే అర‌టి పండ్ల‌ను తిన‌డానికి ఒక నియ‌మం ఉంది. అదేమిటంటే..

can pregnant women take banana or what

ఆయుర్వేదం ప్ర‌కారం భోజ‌నానికి ముందు ఉసిరికాయ‌ల‌ను తినాలి. అలాగే భోజ‌నం అనంత‌రం రేగు పండ్ల‌ను తినాలి. దీని వ‌ల్ల తిన్న ఆహారం చ‌క్క‌గా జీర్ణ‌మ‌వుతుంది. కొవ్వు పేరుకుపోదు. గ్యాస్, అజీర్ణం, ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అయితే భోజ‌నానికి ముందు లేదా భోజ‌నం త‌రువాత లేదా భోజ‌నం చేసే స‌మ‌యంలో.. ఎప్పుడైనా స‌రే అర‌టి పండ్ల‌ను మాత్రం తిన‌కూడ‌ద‌ని ఆయుర్వేదం చెబుతోంది. ఇది గ‌ర్భ‌వతుల‌కే కాదు.. అంద‌రికీ వ‌రిస్తుంద‌ట‌.

భోజ‌నం స‌మ‌యంలో అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌ఫం, వికారం పెరుగుతాయి. అందువ‌ల్ల అర‌టి పండ్ల‌ను ఆ స‌మ‌యంలో తిన‌రాదు. కొంద‌రు పెరుగులో అర‌టి పండ్ల‌ను క‌లిపి తింటుంటారు. అలా చేయకూడ‌ద‌ని ఆయుర్వేదం చెబుతోంది. ఇక భోజ‌నానికి కొన్ని గంట‌ల ముందు లేదా త‌రువాత ఎప్పుడైనా స‌రే విడి స‌మ‌యంలో అర‌టి పండ్ల‌ను నిక్షేపంగా తిన‌వ‌చ్చ‌ని.. గ‌ర్భ‌వతులు కూడా ఆ స‌మ‌యంలో వీటిని తీసుకోవ‌చ్చ‌ని.. ఇందుకు ఎలాంటి నియ‌మాలు లేవ‌ని ఆయుర్వేదం చెబుతోంది. క‌నుక అర‌టి పండ్ల‌ను తినేట‌ప్పుడు ఈ నియ‌మాన్ని గుర్తుంచుకోవాలి. ఇక గ‌ర్భ‌వతులు కూడా అర‌టి పండ్ల‌ను తిన‌కూడ‌ద‌ని అపోహ‌ను పెట్టుకోరాదు. పైన చెప్పిన విధంగా ఆయా స‌మ‌యాల్లో అర‌టి పండ్ల‌ను తిన‌వ‌చ్చు. దీంతో బిడ్డ‌కు కూడా పోష‌ణ ల‌భిస్తుంది. క‌నుక ఈ విధంగా వ్య‌వ‌హ‌రిస్తే అర‌టి పండ్ల‌తో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts