lifestyle

నెయ్యి, బీర్లు, పచ్చళ్లను ఎన్ని రోజుల వరకు తినవచ్చు.. వాటికి Expire date ఉంటుందా !

మెడిసిన్ కు ఎక్స్ పైర్ డేట్ ఉన్నట్లే, అదే విధంగా ఆహారం కూడా కొంతకాలం తర్వాత పాడైపోతుంది. అది తినడానికి పనికి రాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనం నెయ్యి, వెన్న, పచ్చళ్లు వంటి వాటిని ఎక్కువ రోజులు వాడుతాయి. మెడిసిన్ కు ఎక్స్ పైర్ తేదీ ఉన్నట్లు.. మనకు తెలుస్తుంది కానీ నెయ్యి, వెన్న, పచ్చళ్లు వంటి వాటి గురించి తెలీదు. అయితే ఇప్పుడు నెయ్యి, వెన్న, పచ్చళ్లు వంటి వాటి జీవితం కాలం, వాటిని తినడం ఎంతకాలం సురక్షితం వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెన్న ఇంట్లో తయారు చేసినా లేదా మార్కెట్ నుండి తెచ్చినా కూడా గడువు తేదీ ఉంటుంది. ప్యాకెట్‌లో ఉంచిన వెన్న 2-3 నెలల వరకు పరిపూర్ణంగా ఉంటుంది. ప్యాకెట్‌ ఓపెన్ చేసిన వెన్న 1-2 నెలల వరకు ఉపయోగించవచ్చు.

మనం ఇంట్లో కూరలు వండనప్పుడు పచ్చళ్లను తినవచ్చు, కానీ దీనికి ఎక్స్‌పైరీ కూడా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పచ్చళ్లను గరిష్టంగా ఒక సంవత్సరం వరకు తినవచ్చు. కోడిగుడ్లను నెలల తరబడి ఫ్రిజ్‌లో ఉంచి తింటూనే ఉంటారు. గుడ్లకు గరిష్టంగా 3 వారాల వరకు మాత్రమే ఎక్స్‌పైరీ ఉంటుంది. ఆ తర్వాత తినకూడదు. మార్కెట్‌లో లభించే నెయ్యిపై ఎక్స్‌పైరీ డేట్ రాసి ఉంటుంది. కానీ.. ఇంట్లో తయారుచేసుకునే వారు.. నెయ్యి ఎప్పుడు పాడైపోతుందని తెలుసుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఓపెన్ నెయ్యి 1 సంవత్సరం మాత్రమే వాడాలి.

do you know how much expiry these items have

ప్రస్తుతం మార్కెట్‌లో పాకెట్ కూరగాయలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిపై గడువు తేదీ కూడా రాసి ఉంటుంది. అవి 1-2 రోజుల వరకు బాగానే ఉంటాయి, కానీ తెరిచిన తర్వాత అవి గోధుమ లేదా నల్లగా మారడం ప్రారంభిస్తే, వాటిని తినవద్దు. ఫ్రిజ్‌లో ఉంచిన బీరుకు 1 సంవత్సరం వరకు గడువు తేదీ ఉంటుంది.

Admin

Recent Posts