చికెన్, మటన్ వంటి నాన్ వెజ్ ఆహారాలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఆదివారం వస్తే నాన్ వెజ్ షాపుల ఎదుట రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే బర్డ్ ఫ్లూ కారణంగా ప్రస్తుతం చాలా మంది చికెన్‌ను ఎక్కువగా తినడం లేదు. దీంతో మటన్, చేపల రేట్లు పెరిగిపోయాయి. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా.. మటన్ కొడుతున్నప్పుడు ఆ కత్తిని గనక చూస్తే మనకు ఒక విషయం అర్థం అవుతుంది. మనం ఇంట్లో వాడే మటన్ కొట్టే కత్తి లేదా కొందరు షాపుల్లో మటన్ కొట్టే కత్తికి ఒక్కోసారి మనం చిన్న పాటి రంధ్రాన్ని చూస్తుంటాం. అయితే ఈ రంధ్రాన్ని ఎందుకు ఏర్పాటు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మటన్ కొట్టే కత్తి వెడల్పుగా ఉంటుంది. ఈ క్రమంలో కత్తితో మటన్‌ను కట్ చేసినప్పుడు మటన్‌పై ప్రెషర్ సమానంగా పడాలి అంటే కత్తికి ఒక చోట రంధ్రం ఉండాలి. దీంతో మటన్‌పై కత్తి ప్రెషర్ సమానంగా పడుతుంది. అప్పుడు మటన్ సరిగ్గా కట్ అవుతుంది. అలాగే ఇలా హోల్ ఉండడం వల్ల మటన్ కత్తి లైఫ్ కూడా పెరుగుతుంది. త్వరగా పాడవకుండా ఉంటుంది.
ఇక మటన్ కత్తిని ఉపయోగించిన తరువాత దానిపై ఆయిల్స్, కొవ్వు పేరుకుపోతాయి. ఎంత శుభ్రం చేసినా పోవు అలాంటప్పుడు కత్తిని ఒక దారంతో పట్టుకుని ఎక్కడైనా తగిలించి శుభ్రంగా కడగవచ్చు. అలాగే కత్తిని వేలాడదీస్తే త్వరగా నీరు పోయి డ్రైగా మారుతుంది. దీంతో కత్తిని మళ్లీ త్వరగా ఉపయోగించవచ్చు. అలాగే కత్తికి తుప్పు పట్టదు. ఎక్కువ కాలం మన్నుతుంది. అందుకనే దాదాపుగా చాలా వరకు మటన్ కొట్టే కత్తులకు ఇలా చిన్నపాటి రంధ్రాలను ఏర్పాటు చేస్తారు. ఇదీ.. దాని వెనుక ఉన్న అసలు విషయం..