అరటి పండ్లు అంటే చాలా మందికి ఇష్టమే. ఇవి మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తుంటాయి. అరటి పండ్లను తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అరటి పండ్లు జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లను తింటే గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు. బీపీని తగ్గించేందుకు కూడా అరటి పండ్లు పనిచేస్తాయి. శారీరక శ్రమ చేసిన వారు, వ్యాయామం చేసిన వారు అరటి పండ్లను తింటే కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చు. దీంతో ఉత్సాహంగా ఉంటారు. మళ్లీ యాక్టివ్‌గా పనిచేస్తారు. అయితే అరటి పండ్లను మనం ఎప్పుడు తిన్నా కాండం ఉన్న వైపు ఒలిచి తింటాం. కానీ మీకు తెలుసా..? కోతులు మాత్రం కింది నుంచే అరటి పండ్లను తింటాయి.
కోతులు అరటి పండ్లను తిన్నప్పుడు మీరు ఎప్పుడైనా బాగా గమనించి చూశారా..? కోతులు అరటి పండ్లను ఎల్లప్పుడూ కింది నుంచే వలిచి తింటుంటాయి. మనలాగా కాండం వైపు నుంచి తినవు. అయితే ఇవి అలా ఎందుకు చేస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా..? అయితే ఇందుకు ఒక కారణం ఉంది.. అదేమిటంటే.. సాధారణంగా కోతులతో పోలిస్తే మనుషులకు బలం ఎక్కువ. కనుక మనం అరటి పండ్లను కాండం వైపు వలిచి తింటాం.
కానీ కోతులకు చేతుల్లో బలం చాలా తక్కువగా ఉంటుందట. అవి అరటి పండు కాండాన్ని అంత సులభంగా వలచలేవట. అందుకనే అవి కింది వైపు నుంచి అరటి పండ్లను వలిచి తింటాయట. వాటి చేతులు సులభంగా, తేలిగ్గా ఉంటాయి కనుకనే అవి చెట్ల కొమ్మలను సులభంగా పట్టుకుని వేలాడుతాయి. వాటి చేతులు ఉన్న నిర్మాణం వల్లనే అవి అరటి పండ్లను కాండం వైపు కాకుండా కింది వైపు వలిచి తింటాయట. ఇదీ.. అసలు విషయం.