హెల్త్ టిప్స్

ఉల‌వ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా..?

ఉలవలు ఆరోగ్యానికి చాలా మంచిది. నవ ధాన్యాల్లో ఒకటైన ఈ ఉలవలని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ఉండే బెనిఫిట్స్ మనకి ధాన్యం లో కూడా ఉండవు అంటే ఎంత మంచిదో అర్ధం అయ్యిందా…? మరి వీటి వల్ల కలిగే లాభాల కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి. ఉలవలని తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తొలగి పోతాయి. ఉలవల్లో పాస్ఫరస్‌, ఫైబర్, ఐరన్‌, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. దీని మూలం గానే శరీరానికి చక్కని పోషణ కలుగుతుంది. అలానే ఉలవల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఎదిగే పిల్లలకి కూడా వీటిని పెడితే మంచిది.

రోగాలతో పోరాడే ఇమ్యూనిటీ పవర్‌ను సైతం ఇది పెంచుతుంది. అలానే కిడ్నీ సమస్యల తో బాధ పడే వారికి ఇది బెస్ట్ ఫుడ్ అని మనం చెప్పుకోవచ్చు. దీనిలో ఉండే ఫైబర్ వల్ల మలబద్దకం రాకుండా అడ్డుకుంటుంది. ఉలవల కషాయం తీసుకుంటే దగ్గు, ఉబ్బసం తో బాధ పడుతున్న వారికి మంచి పరిష్కారం చూపిస్తుంది.

many wonderful health benefits of horse gram

రక్తహీనత తో బాధ పడేవారు వీటిని తమ డైట్ లో చేర్చితే మంచి పరిష్కారం ఉంటుంది. ఉలవలను కషాయంగా కాని, చారు రూపంలా గాని తీసుకుంటే కూడా వీటి నుండి బయటపడవచ్చు. ఉలవలను, కొత్త బియ్యాన్నీ సమానంగా తీసుకుని జావ చేసుకుని తాగితే కాల్షియం లభిస్తుంది. ఎముకులకు, కండరాలకు కూడా ఇది శక్తినిస్తుంది.

Admin

Recent Posts