lifestyle

Hotel Bill : 1965 నాటి హోటల్ బిల్ ఇది.. అప్పుడు రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

Hotel Bill : ఈరోజులలో ఎక్కడ చూసినా, ప్రతి ఒక్కరూ కూడా బిజినెస్ లు చేస్తున్నారు. బిజినెస్ లని చేసి, డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. ఉద్యోగులు కూడా, చాలామంది బిజినెస్ ల వైపు వెళ్తున్నారు. అయితే, ఇప్పుడు మనం ఎక్కడికైనా రెస్టారెంట్ కి వెళ్లాలంటే, కనీసం 500 అయినా ఖర్చు అవుతుంది. ఒక ముగ్గురు, నలుగురు వెళితే, కచ్చితంగా వెయ్యికి పైనే బిల్ అవుతుంది. ఫుడ్ తో పాటుగా, జీఎస్టీ కూడా కట్టాల్సి ఉంటుంది. పైగా ఈరోజుల్లో పాలు, గ్యాస్, ఆయిల్ ధరలు బాగా పెరిగిపోవడంతో, రెస్టారెంట్ల వాళ్ళు కూడా డబ్బులు బాగా పెంచేశారు.

పైగా రుచి ఏమైనా ఉంటుందంటే, ఇంట్లో చేసిన ఆహార పదార్థాలలాగే వుండవు. క్వాలిటీ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఇదిలా ఉంటే, ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా బయట తినడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువగా జాబ్ టెన్షన్ వలన ఉద్యోగం చేసుకుంటూ సమయం లేకపోవడం ఇలా రకరకాల కారణాల వలన బయట ఎక్కువ తింటున్నారు. రెస్టారెంట్లలో రెగ్యులర్ గా తింటే, చాలా డబ్బులు వృధా అయిపోతాయి.

hotel bill from 1965 viral on social media hotel bill from 1965 viral on social media

ఇదివరకు మాత్రం ధరలు తక్కువగానే ఉండేవి. ఇప్పుడు మాత్రం ధరలు బాగా పెరిగిపోయాయి. 1965లో నిత్యవసర వస్తువులు ధరలు పెరిగిన కారణంగా, అన్ని హోటల్స్ లో కూడా టిఫిన్ ధరలను పెంచారు. రేపల్లెలోని హోటల్స్ యజమానులు అందరూ కలిసి పాంప్లెట్స్ ని ప్రింట్ చేశారు.

ఆ పాంప్లెట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయింది. నవంబర్ 1,1965 నుంచి పెరిగిన తరవాత రేట్లు ఇలా వున్నాయి. 2 ఇడ్లి 15 పైసలు, అట్టు 15 పైసలు, ఉప్మా 15 పైసలు, రవ్వ అట్టు 20 పైసలు అని వుంది. అలానే, కాఫీ, టీ 15 పైసలు అని వుంది. కానీ, ఇప్పుడేమో వందలు, వేలే ఖర్చు అవుతున్నాయి. అప్పటికి, ఇప్పటికీ ఎంతలా మార్పు వచ్చేసిందో..?

Admin

Recent Posts