lifestyle

కృత్రిమంగా మగ్గబెట్టిన మామిడి పండుని గుర్తించడం ఎలా?

సహజంగా మగ్గిన పండ్లకు రంగు కొన్ని చోట్ల పచ్చగా, కొన్ని చోట్ల పసుపు రంగులో వుంటుంది, పండు అంతా ఒకే రంగులో వుండదు. కృత్రిమంగా మగ్గించిన పండ్లకు రంగు ఒకేలా వుండి బాగా బ్రైట్ గా నిగనిగలాడుతూ ఉంటుంది. సహజంగా మగ్గిన మామిడి పండ్లకు ప్రత్యేకమైన తీపి వాసన ఉంటుంది. కృత్రిమంగా మగ్గించిన వాటిలో మామిడి వాసన చాలా తక్కువగా లేదా అసహజంగా ఉంటుంది.

సహజంగా మగ్గిన మామిడి పండ్ల తొడుగు సన్నగా, బాగా ఎండినట్టుగా, తడి తడి గా ఉంటుంది. కృత్రిమంగా మగ్గించిన పండ్ల తొడుగు బాగా పొడి పొడిగా, కొంచెం పచ్చగా, బలంగా కనిపిస్తుంది. సహజంగా మగ్గిన పండు పట్టుకున్నప్పుడు కొంచెం మెత్తగా వుంటుంది. కృత్రిమంగా మగ్గిన పండు చాలా గట్టిగా వుంటుంది.

how to identify mangoes ripen naturally or not

కార్‌బైడ్ వాడిన పండ్లపై తెల్లగా పొడి పొడి మచ్చలు కనిపించవచ్చు. అలానే పండ్లకి కొంచెం అసహజమైన రుచి ఉంటుంది. సహజ పండు లోపల కూడా పసుపు రంగులో ఉంటుంది. కృత్రిమ మగ్గింపు వల్ల బయట రంగు అందంగా ఉన్నా, లోపల కొంచెం పచ్చిగా, తెల్లగా ఉండే అవకాశం ఉంటుంది.

Admin

Recent Posts