మాములుగా ఈ మధ్య తెలుగు హీరోయిన్‌లు తెరపై కనిపించడమే గగనమైపోయింది. ఎప్పుడో ఒకరు.. లైమ్‌లోకి వస్తున్నారు గానీ, వాళ్లకు కూడా పెద్దగా ఆఫర్‌లు రావడం లేదు. అలా గంపెడంత టాలెంట్ ఉండి కూడా.. స్టార్ హీరోయిన్ కాలేకపోయింది శ్రీదివ్య. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన శ్రీదివ్య హీరోయిన్‌గా మంచి మంచి సినిమాలు చేసింది. హనుమాన్ జంక్షన్, యువరాజు, వీడే.. ఇలా పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా పని చేసిన శ్రీదివ్య.. నచ్చావులే సినిమాతో హీరోయిన్‌గా మారింది. తొలి సినిమాతోనూ సూపర్ హిట్టు అందుకుంది. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన బస్ స్టాప్ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా మంచి హిట్టయింది. ఆ తర్వాత శివ కార్తికేయన్‌తో తమిళ్ డెబ్యూ ఇచ్చింది. వరుసగా 2,3 సినిమాలు అక్కడే చేసింది.
ఆ తర్వాత మళ్లీ తెలుగులో కేరింత సినిమా చేసింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది కానీ.. స్టార్ స్టేటస్ మాత్రం తెచ్చుకోలేకపోయింది. మధ్యలో కార్తితో కాష్మోరా, విశాల్‌లతో రాయుడు ఇలా స్టార్ హీరోలతో సినిమాలు చేసింది కానీ హిట్లు మాత్రం పడలేదు. ఇక ఇదిలా ఉంటే శ్రీ దివ్య అక్క కూడా టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్ అని మీకు తెలుసా..? అవును… ఆమె పేరు శ్రీ రమ్య. 2008లో వచ్చిన 1940లో ఒక గ్రామం అనే సినిమాలో నటించింది శ్రీ రమ్యనే. ఈ సినిమాకు ఏకంగా నంది అవార్డు సైతం గెలుచుకుంది.
ఆ తర్వాత శ్రీకాంత్‌తో విరోధి, అలియాస్ జానకి వంటి సినిమాలు చేసింది అవి డిజాస్టర్‌లు కావడంతో ఈ బ్యూటీ పెద్దగా అవకాశాలు రాలేదు. 2013లో తమిళంలో యమున అనే సినిమాలో చివరిసారిగా శ్రీ రమ్య కనిపించింది.