lifestyle

Wife And Husband : భార్యాభ‌ర్త‌లు ఎప్ప‌టికీ విడిపోకుండా ఉండాలంటే.. ఇవి పాటించాలి..!

Wife And Husband : కలకాలం కలిసి భార్యాభర్తలు ఆనందంగా ఉండాలని పెళ్లి చేసుకుంటారు. ఈరోజుల్లో చాలా మంది భార్యాభర్తలు విడిపోతున్నారు. భార్య భర్తలు కనుక ఎప్పటికీ విడిపోకుండా ఉండాలంటే వీటిని పాటించాలి. వీటిని పాటిస్తే ఎప్పుడూ భార్యాభర్తలు కలకాలం కలిసి ఆనందంగా ఉండొచ్చు. భార్యాభర్తలు సరదాగా కాసేపు వాళ్ళ మనసులో భావాలని చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ మధ్య ప్రేమ బాగా పెరుగుతుంది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా ఒకరికొకరు తమ యొక్క ఆలోచనలు, నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకుని చెప్పుకోవాలి.

భార్యను కానీ భర్తను కానీ వదిలిపెట్టి వెళ్లే మనస్తత్వం ఉండకూడదు. చాలామంది భార్య వంటింటికే పరిమితం అని అనుకుంటారు. భర్త కూడా భార్యకు సహాయం చేయొచ్చు. తప్పులేదు. అలా చేయడం వలన బంధం మరింత గట్టి పడుతుంది. చాలామంది భర్త ఆఫీసు నుండి ఆలస్యంగా వచ్చినా కూడా ఏమీ తినకుండా ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఎదురు చూడడం ప్రేమ కాదు. ఆలస్యం అయినా సరే టైం కి తిని నిద్రపోవాలి.

husband and wife follow these to be joint forever

ఒక్కొక్కసారి భర్త ఏదైనా జోక్ చెప్పినా, భార్యకి అర్థం కాకపోయినా నవ్వు రాకపోయినా, కొంచెం సరదాగా సంతోషంగా ఉంటే భర్త సంతోషంగా ఉంటారు. భార్యకి ఎంత హక్కు ఉందో భర్తకి కూడా అంతే హక్కు ఉంది. భార్యకి ఎంత బాధ్యత ఉందో భర్తకి కూడా అంతే బాధ్యత ఉంది అని అనుకుంటే కచ్చితంగా వారి జీవితం బాగుంటుంది.

భార్యాభర్తల మధ్య నమ్మకం చాలా ముఖ్యం. నమ్మకంగా ఉండాలి. నిజాయితీ, నమ్మకం, తప్పు చేసినప్పుడు క్షమాపణ అడగడం ఇవన్నీ కూడా భార్య భర్తల బంధంలో ముఖ్యమైనవి. భర్త ఏదైనా మాట్లాడినప్పుడు భార్య మౌనంగా ఉండడం మంచిది కాదు. అలానే భార్య భర్తలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, ఇష్టాలని పంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇలా అయితే వారి బంధం బాగుంటుంది.

Admin

Recent Posts