ఇల్లు, ఆఫీస్ లేదా బయట ఎక్కడికైనా వెళ్లినా.. ఫంక్షన్‌లో అయినా.. ఎవరైనా ఫ్యాషనబుల్‌గా కనిపించాలని కోరుకుంటారు. అందుకు అనుగుణంగానే నూతన తరహా డిజైన్లతో కూడిన డ్రెస్‌లు వేసుకుంటారు. అందరి దృష్టినీ తమవైపు తిప్పుకుంటారు. అయితే ఇంత వరకు బాగానే ఉంటుంది కానీ డ్రెస్సింగ్ స్టైల్‌లో తేడా వస్తే మాత్రం అంతే. ఏదైనా చిన్న పొరపాటు డ్రెస్సింగ్ స్టైల్‌లో జరిగితే అప్పుడు ఎదుటి వారు మనల్ని అసహ్యంగా చూస్తారు. వీరికి డ్రెస్ సెన్స్ కూడా తెలియదు అని బహిరంగంగానే విమర్శస్తారు. అయితే కింద తెలిపిన సూచనలు పాటిస్తే అలాంటి విమర్శలను ఎదుర్కొనాల్సిన పని ఉండదు. ఈ సూచనలతో మీరు ఏయే రకాల డ్రెస్‌లను ఎలా ధరించాలి, స్టైల్ గా ఎలా కనిపించాలి అనే విషయాలను తెలుసుకోవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
కోటు ధరించే వారు దానికి ఉన్న మధ్యలో బటన్‌ను మాత్రం ఎప్పుడూ పెట్టుకునే ఉండాలి. అస్సలు తీసేయరాదు. ఇక పై బటన్‌ను మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. మీ సౌకర్యానికి, ఇష్టానికి తగినట్టుగా పై బటన్‌ను కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. లేదంటే తీసేయవచ్చు. అదేవిధంగా కింది భాగంలో ఉన్న బటన్‌ను మాత్రం అస్సలు పెట్టరాదు. దాన్ని అలాగే వదిలేయాలి. కోటును వేసుకునే వారు కచ్చితంగా పాటించాల్సిన సూచన ఇది. షర్ట్ లేదా బ్లౌజ్‌ను వేసుకునే వారు రెండు బటన్ల కన్నా ఎక్కువ బటన్లను తీయరాదు. తీస్తే క్లీవేజ్ కనిపిస్తుంది. అసహ్యంగా ఉంటుంది. ఇయర్ రింగ్స్, బ్రేస్ లెట్ లేదా నెక్లెస్, ఉంగరం మ్యాచ్ అయ్యేలా ఆభరణాలు ధరించాలి. అలా కాకుండా ఇయర్ రింగ్స్, నెక్లెస్, బ్రేస్ లెట్, ఉంగరం అన్నీ ఒకేలా ఉండేలా ధరిస్తే బాగుండదు. ఏవైనా రెండు మాత్రమే మ్యాచ్ అయ్యేలా ధరిస్తేనే బాగుంటుంది.
టై ని మరీ పొడవుగా లేదా పొట్టిగా ధరించరాదు. అది బొడ్డు దాటి నడుం వరకు కొద్దిగా వచ్చేట్టు ధరిస్తే చాలు. మినీ స్కర్ట్ లేదా క్లీవేజ్ ఏదో ఒక తరహా డ్రెస్‌ను మాత్రమే వేసుకోవాలి. రెండు డిజైన్లు కలిపి ఉండేలా డ్రెస్ ధరిస్తే బాగుండదు. కోటు లేకుండా షర్ట్ మాత్రమే ధరిస్తుంటే టై అవసరం లేదు. మహిళా ఉద్యోగులు ఆఫీసులో ధరించే డ్రెస్‌లలో షర్ట్ క్లీవేజ్ కాలర్ బోన్ నుంచి 4 ఇంచుల లోపలికే ఉండాలి. 4 ఇంచులు దాటితే బాగుండదు. పురుషులు టక్ చేసుకుంటే బెల్ట్ కచ్చితంగా ధరించాలి. మహిళలు టాప్, జీన్స్ వేసుకుంటే టాప్ కింద నడుం భాగం కనిపించరాదు. అలా కనిపించకుండా వేరే ఏదైనా టాప్ ధరించాలి.
పురుషులు ధరించే బెల్ట్, షూస్ కలర్ ఒకే విధంగా ఉంటే బాగుంటుంది. దుస్తులకు ఉండే ట్యాగ్‌లను కచ్చితంగా కట్ చేసి ధరించాలి. మహిళలు టాప్, బాటమ్ ధరించే దుస్తులు రెండు వేర్వేరు కలర్స్ వి అయి ఉండకూడదు. ఒకే కలర్‌వి రెండు వేర్వేరు షేడ్స్ లేదా రెండు వేర్వేరు సైజ్‌లలో ఉన్న దుస్తులను ధరించాలి. కూర్చున్నప్పుడు సాక్స్ పై నుంచి కాళ్లు కనిపించకూడదు. లాంగ్ సాక్స్ ధరించాలి. ఆఫీస్ కు స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి వెళ్తే అది భుజాలను కవర్ చేయాలి. స్ట్రాప్స్ తరహాలో ఉంటే బాగుండదు.