హెల్త్ టిప్స్

మన బాడీ ఫిట్ గా ఉండాలి అంటే ఎం చేయాలి ?

చాలా మంది శ‌రీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలి అంటే అదేదో పెద్ద క‌ష్టంలా భావిస్తారు. క‌ష్ట సాధ్య‌మైన ప‌నిగా చూస్తుంటారు. కానీ బాడీ ఫిట్‌గా ఉండ‌డం లేదా బాడీని ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవ‌డం అనేది వాస్త‌వానికి ఒక బాధ్య‌త అని అంద‌రూ గుర్తుంచుకోవాలి. రోజూ మనం వాళ్ల కోసం ఎంత‌గా క‌ష్ట‌ప‌డ‌తామో మ‌న కోసం కూడా మ‌నం కాస్త శ్ర‌మించాలి. దీన్ని ఒక బాధ్య‌త‌గా భావించాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండ‌డం అల‌వాటు అవుతుంది.

ఈ శ‌రీరం నాదా, ప‌క్క వాడిదా.. అన్న ప్ర‌శ్న వేసుకుంటే బాడీని ఫిట్‌గా ఉంచుకోవాల‌నే త‌పన మీలో పెరుగుతుంది. ఇందుకు గాను మిమ్మ‌ల్ని మీరు రోజూ అద్దంలో చూసుకోండి. అప్పుడు బాడీ ఫిట్ నెస్‌పై శ్ర‌ద్ధ పెట్టాలన్న ధ్యాస ఏర్ప‌డుతుంది. బాడీ ఫిట్‌గా ఉండాలంటే వ్యాయామం చేయ‌డం మాత్ర‌మే కాదు, స‌రైన ఆహారాన్ని తీసుకోవ‌డం కూడా ముఖ్య‌మే. చాలా మంది రోజూ జంక్ ఫుడ్‌ను తింటున్నారు. సాయంత్రం అయిందంటే చాలు.. ర‌హ‌దారుల ప‌క్క‌న బండ్ల చుట్టూ గుమిగూడి తింటుంటారు. జిహ్వా చాపల్యాన్ని చంపుకోలేక అలా చేస్తుంటారు. కానీ ఎంత వ్యాయామం చేసినా జంక్ ఫుడ్‌ను తింటే మాత్రం ఆ శ్ర‌మ బూడిదలో పోసిన ప‌న్నీరు అవుతుంది. మీరు వ్యాయామం చేసి కూడా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. క‌నుక ఆహారం విష‌యంలోనూ స‌రైన ఎంపికలు ఉండాలి.

what to do to keep our body fit

మ‌నం మ‌న ఫోన్‌కు రోజూ చార్జింగ్ పెడ‌తాం. చార్జింగ్ పెట్ట‌కుండా ఫోన్‌ను ఉప‌యోగించ‌లేం క‌దా. అలాగే మ‌న బాడీకి కూడా వ్యాయామం అనేది చార్జింగ్ ఇస్తుంది. శ‌రీరానికి కొత్త శ‌క్తి వ‌చ్చేలా చేస్తుంది. కండ‌రాల నిర్మాణానికి స‌హాయం చేస్తుంది. క‌ణాలు పున‌రుత్తేజం చెందేలా చేస్తుంది. మీరు రోజూ వ్యాయామం చేయ‌క‌పోతే ఈ లాభాల‌న్నీ కోల్పోయిన‌ట్లే. ఆరోగ్యంగా ఉండాలంటే మీ శ‌రీరానికి ఏం కావాలో వాటినే తినాలి. అది కూడా మోతాదులోనే తినాలి. రోజుకు క‌నీసం 10వేల అడుగులు న‌డ‌వాల‌ని వైద్యులు చెబుతుంటారు. అంత కాక‌పోయినా క‌నీసం 100 క్యాల‌రీల నుంచి 200 క్యాల‌రీలు ఖ‌ర్చ‌య్యేలా రోజూ ఏ వ్యాయామం చేసినా చాలు, బాడీని ఫిట్‌గా ఉంచుకోవ‌చ్చు.

Admin

Recent Posts