ఆరోగ్యం, ఫిట్ నెస్ అనేవి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్ధాయిలలో అనుభవిస్తాం. ఆరోగ్య నిర్వహణ ఎప్పటికపుడు కలిగే మార్పుకు సంబంధించినది. మనలో ప్రతి ఒక్కరూ శారీరక నిర్మాణ అవసరాల కొరత లేదా ఎక్కువవటాల్ని ఆహారం ద్వారా లేదా జీవన విధానం మార్చుకోడం ద్వారా లేదా అదనంగా కొన్ని ఆహారంలో చేర్చుకోడం ద్వారా కూడా సరి చేసుకుంటాం. మంచి ఆరోగ్యం, సంక్షేమాలను కలిగించే కొన్ని అంశాలను పరిశీలించండి. మానసిక ఆనందం లేదా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ – ఆరోగ్యానికి చక్కటి మంత్రం…ప్రతి ఒక్కరూ తమలో తాము మానసిక ఆనందం కలిగి వుండటం. చాలామంది ఫిట్ నెస్ అంటే…బయటకు బాగా కనపడటమని భావిస్తూ అసలైన మానసిక ఆనందం కోల్పోతూంటారు.
ఆహారం – డైటింగ్ అన్న పేరుతో మీ కిష్టమైనవి తినకపోవడం సరి కాదు. ఆహారమంటే మీకు సరైన భావన వుండాలి. మన ముందటి నాగరికతలు, మతాలు అన్నీ కూడా పంటలు, ఆహారం వంటివి భగవంతుడిగా భావించి మంచికి మాత్రమే ముడిపెట్టాయి. మీ కిష్టమైనవి తినండి. అయితే ఏ తిండీ కూడా అధికంగా కొనసాగించకండి. వ్యాయామాలు – ఎవరికిష్టమైన వ్యాయామం వారు స్వేచ్ఛగా ఎంపిక చేయండి. ప్రతి దినం ఆచరించండి. శరీరం, మనస్సు రెండూ కూడా ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శుభ్ర పడాలంటే యోగా ఆచరించడం మంచి సాధనం కాగలదు. పాజిటివ్ గా వుండండి – సవ్యమైన ఆలోచనలు చేయండి. పాజిటివ్ గా భావించే వ్యక్తులతో తిరిగి, వారినుండి సవ్యత్వం నేర్చుకొని మంచివారిగా వుంటూ మానసిక ఆనందం పొందండి.
మోసాలు, మాయలు చేయటం, నిరాశలకు లోనవటం మొదలైనవి చిన్న అంశాలలోనైనా సరే దుఖా:న్ని కలిగిస్తాయి. ప్రతివారికి రోజూవారీ జీవితంలో ఒత్తిడి వుంది. ఆ ఒత్తిడి ఎంతవరకో అంతే వుండాలిగానీ అధికం కారాదు. ఒత్తిడి తగ్గటానికి, చక్కటి సంగీతం వినటం లేదా సాధన చేయటం లేదా ప్రాణాయామం వంటి శ్వాస సంబంధిత చర్యలు, కొద్దిపాటి నడక మొదలైనవి ఆచరిస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. ఎవరికైతే తమ శారీరక అవసరాలు తెలుస్తాయో వారు తమ ఒత్తిడులను కూడా అధిగమించగలరు. ఆరోగ్య, సంక్షేమాలకు ఎస్ట్రాలజీ – ఖగోళం నుండి కొన్ని ఎనర్జీలు వ్యక్తులపైనా, గ్రహాలపైనా, జంతువులపైనా, లేదంటే భూమిపైన కూడా ప్రసరిస్తూంటాయి. ఆరోగ్యం, అనారోగ్యాలు, యాక్సిడెంట్లు మొదలైనవి ఎపుడు కలుగుతాయనేది తెలుసుకోవాలంటే ఎస్ట్రాలజీ ఒక సాధనం.
ఆరోగ్యం, ఆనందాలతో జీవించాలంటే ఈ ఎనర్జీలను ఉపయోగించి సరైన ఆహారం, సరైన ప్రదేశం, జీవనం, సరైన సంబంధాలు, సరైన ఆధ్యాత్మిక సాధనలు కలిగి వుండండి. ఉదాహరణగా చెప్పాలంటే….కుజగ్రహం ఒక వేడికల గ్రహం. ఇది జ్వరం, శారీరక నొప్పులు, మంటలు, ఇన్ఫెక్షన్, గాయాలు వంటి వాటికి కారణమవుతుంది. దీనిని ఎదుర్కొనాలంటే…వ్యక్తి తన జన్మకుండలి మేరకు ఆ సమయాలలో ఆ గ్రహాలకు అనుకూలమైన ఆహారాలు, ఔషధ మూలికలు తినటం, అట్టి గ్రహాల దృష్టిపడే రత్నాలు ధరించటం, లేదా ఆ గ్రహ మంత్రాలు ఆచరించడం వంటివి చేయాలి. అనారోగ్య సమస్యలనుండి దూరంగా వుండాలంటే ప్రతివారూ తమ జన్మకుండలి లేదా జాతకం ఎప్పటికపుడు నిపుణులకు చూపి తగిన పరిష్కార మార్గాలు సమయం మేరకు ఆచరిస్తే ఫలితాలు బాగుంటాయి.