వైద్య విజ్ఞానం

తెల్లవారు జామున గుండె నొప్పి వ‌స్తే నిర్ల‌క్ష్యం చేయ‌కండి.. ఎందుకంటే..?

గుండెపోటు తీవ్రత, గుండెలోని ఎడమ జఠరిక పనితీరు రెండూ కూడా గుండెపోటు వచ్చే సమయంపై ఆధారపడి వుంటాయని సైంటిస్టులు కనిపెట్టారు. తెల్లవారు ఝామున 1 గంట నుండి 5 గంటల వరకు వచ్చే గుండెపోట్లు అధికంగా మరణానికి దోహదం చేస్తున్నాయట. శరీరంలో ఎడ్రినాలిన్, నోరా ఎడ్రినాలిన్, కార్టిసోల్ వంటి హార్మోన్లు విడుదలచేసే నరాల వ్యవస్ధ తెల్లవారు ఝాములోనే ఉత్తేజితమవుతుందట.

ఈ సమయంలో శరీరం నిద్రిస్తున్నా మైండ్ మెళుకువగా వుంటుందని, దీనిని ర్యాపిడ్ ఐ మూవ్ మెంట్ నిద్ర అని, కలలు కూడా ఇదే సమయంలో వస్తాయని, అయితే, విడుదలైన ఈ హార్మోన్లుగుండె కొట్టుకోవడాన్ని కష్టతరం చేస్తాయని, గుండెకు వెళ్ళే రక్తనాళాలకు అడ్డంకిని కలిగిస్తాయని, ఈ సమయంలో గుండె తనను తాను రక్షించుకోడం కష్టమవుతుందని, మిన్నియా పోలిస్ హార్ట్ ఇన్ స్టిట్యూట్ హృదయ నిపుణులు వెల్లడించారు.

if you get chest pain in the morning do not neglect

మరో విషయంగా ఈ సమయంలో గుండె నొప్పి వచ్చినప్పటికి రోగులు ఇసిజి తెల్లవారిన తర్వాత తీయిద్దాములే అనికూడా భావించటం జరుగుతుందని, అజీర్ణం, గ్యాస్ కారణంగా కూడా వచ్చిందని భావించి అశ్రద్ధ చేస్తారని వారు వివరించారు. ఈ కారణాలుగా ఉదయం పూట వచ్చే గుండెపోట్లు ఖచ్చితంగా మరణాలకు దోవతీస్తున్నాయని సైంటిస్టు, స్టడీ నిర్వహించిన సీనియర్ ఆదర్, జే హెచ్ ట్రావర్స్ అభిప్రాయపడ్డారు.

Admin

Recent Posts