lifestyle

అసలైన హైదరాబాద్ బిర్యానీ ఏ ప్రాంతంలో, ఏ రెస్టారెంట్లో సరిగ్గా రుచి చూడగలం?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా హైద‌రాబాద్ బిర్యానీకి ఎంత‌టి పేరు ఉందో అంద‌రికీ తెలిసిందే. ఈ బిర్యానీ అంటే సాధార‌ణ ప్ర‌జ‌లు మొద‌లుకొని సెల‌బ్రిటీల వ‌ర‌కు ఫ్యాన్స్ ఉన్నారు. హైద‌రాబాద్ బిర్యానీకి ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా మంచి పేరు ఉంది. విదేశీయులు సైతం హైద‌రాబాద్‌కు వ‌స్తే ఇక్క‌డి బిర్యానీ రుచి చూడ‌కుండా వెళ్ల‌రు. అంత‌టి పేరు బిర్యానీకి ఉంది. బిర్యానీని కొంద‌రు ఇళ్ల‌లో కూడా వండి తింటుంటారు. హోట‌ల్స్‌లోనూ చాలా మంది త‌ర‌చూ బిర్యానీని లాగిస్తుంటారు. అయితే హైద‌రాబాద్ హోట‌ల్స్‌లో ఏ ప్రాంతంలో బిర్యానీ చాలా బాగుంటుంది..? అన్న ప్ర‌శ్న చాలా మందికి ఉద్భ‌విస్తూ ఉంటుంది. అయితే కొంద‌రు దీనికి స‌మాధానం చెబుతున్నారు.

నేను హైదరాబాద్ లో పారడైస్, బావార్చి లాంటి రెస్టారంట్లో బిర్యాని రుచి చుసినప్పటికి నాకు బాగా నచ్చిన హైదరాబాద్ బిర్యాని అబిడ్స్ లో ఉండే గ్రాండ్ హోటల్ (Grand Hotel) బిర్యాని నే. అసలు సిసలైన హైదరాబాది రుచి చూడాలంటే ఈ రెస్టారెంట్ లో బిర్యాని ఒకసారి తినాల్సిందే.

what is the best place to eat biryani in hyderabad

అబిడ్స్ లో పోస్ట్ ఆఫీస్ వెనకాలే ఉంటుంది ఈ హోటల్. నిత్యం రద్దిగా ఉంటుంది ఈ రెస్టారెంట్. బిర్యాని తో పాటు, ఈ రెస్టారెంట్ లో కద్దు కా ఖీర్ (kaddu ka kheer) మరియూ కుబాని కా మిఠా (kubani ka meeta) రుచి చుస్తే ఆ ఆనందమే వేరు. అయితే అంద‌రికీ ఒకే హోట‌ల్‌లో న‌చ్చాల‌ని లేదు. కనుక ఒక్కొక్క‌రికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. హైద‌రాబాద్‌లో బావ‌ర్చి, ప్యార‌డైజ్ హోట‌ల్స్ బిర్యానీలో చాలా ఫేమ‌స్‌. అలాగే పిస్తా హౌస్‌, షాగౌస్ బిర్యానీ కూడా చాలా బాగుంటాయ‌ని అంటారు.

Admin