lifestyle

మ‌న దేశంలో అత్యంత సుంద‌ర‌మైన ప్ర‌దేశం ఏది..?

భారతదేశం జీవించడానికి ఉత్తమమైనది. భారతదేశం కంటే భయం లేకుండా శాంతియుతంగా జీవించడానికి ప్రపంచంలో అత్యుత్తమ దేశం ఏది? మొన్న టీవీలో ఒక యాడ్ చూశాను అందులో భార్యాభర్తలిద్దరూ సెకండ్ హనీమూన్ కి ఏ ప్లేస్ కి వెళ్దాము అని అనుకుంటుండగా ఇంతలో అతను గ్రీస్ బాగుంటుంది అక్కడికి వెళ్దాం అంటాడు. కుమవన్ ప్రాంతం హిమాలయాల్లో ఉత్తరాఖండ్ లోనిది, అత్యంత సుందరమైన ప్రదేశాలను కలిగి ఉంది నైనిటాల్ ఆల్మోరా ఇంకా ఎన్నో….. బైక్ నడుపుతుంటే, దారిపొడవునా ఉంటే ఎన్నో ఇలాంటి సుందరమైన దృశ్యాలు. అల్మోర లో అక్కడి స్థానిక ప్రజలు తమ ఇళ్లను చిన్నచిన్న రూములు గా విభజించి చాలా తక్కువ రేటుకు అద్దెకు ఇస్తుంటారు అలా ఒక ఇంట్లో ఉన్నప్పుడు నా పక్క రూం లో ఒక గ్రీసు దేశస్థుడు ఉన్నాడు.

అతని గురించి ఇలా చెప్పాడు. అతనికి గ్రీస్ లో ఒక పెద్ద ఇల్లు సముద్రానికి దగ్గరగా ఉండేదట, అయితే అతను బోర్ కొట్టి ఇల్లు అమ్మేశాడు తర్వాత అతను ఇండియాకు వచ్చి తమిళనాడు లోని ఒక స్కూల్లో పిల్లలకు పాఠాలు చెబుతున్నాడు. ఎండాకాలంలో అతను హిమాలయాలకు వస్తుంటాడు. అతను హిమాలయాలకు మించిన అందం ఎక్కడ లేదంటాడు. ఇతనే కాదు అమెరికా, కెనడా, ఇజ్రాయిల్ ఇలా అనేక దేశాల నుంచి ప్రజలు ఇండియాకు వచ్చి ఇక్కడ యోగా, వంట, సంగీతం తరగతులకు వెళ్తుంటారు. అయితే వీళ్లలో చాలామంది ఢిల్లీలో దిగగానే ఒక బైక్ కొంటారు దాని మీదనే హిమాలయాల్లో తిరుగుతూ ఉంటారు. తర్వాత వెళ్ళేటప్పుడు అదే బైక్ ని కొంచెం తక్కువ ధరకు అమ్మేసి వాళ్ల దేశానికి వెళ్ళిపోతారు.

what is the most beautiful place in india

ఇలా ఎందుకంటే ఒక కాశ్మీరు తప్ప హిమాలయ ప్రాంతం అంతా ప్రశాంతంగానే ఉంటుంది మరియు చాలా తక్కువ ధరకు అన్ని వసతులు సమకూరుతాయి. ఒకసారి అమెరికాలోని yasomati నేషనల్ పార్క్ లో ఒక రాత్రికి నేను హోటల్కు చెల్లించిన ధర 200 డాలర్లు. ఇంకొందరైతే మెడికల్ టూరిజం లో భాగంగా తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేసుకొని మిగతా డబ్బుతో ఇండియా మొత్తం తిరుగుతారు. ఒక రోజు రూమ్ లో నుంచి బయటకు వచ్చి బయటికి చూస్తుంటే ఓ చిత్రం కనిపించింది, మొదట అవి ఆకాశంలోని మబ్బుల అనుకున్నాను, కొంచెం సేపటి తర్వాత కానీ అర్థం కాలేదు అవి దూరంగ ఉన్న హిమాలయ పర్వతాలు అని, యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వతాలు కనిపించాయి. కనుక మిత్రమా భారతదేశంలోని హిమాలయకు మించిన ప్రశాంతమైన ప్రాంతం ఎక్కడ లేదు అనిపిస్తుంది నాకు. నేపాల్, భూటాన్ కూడా బాగుంటాయని చదివాను కానీ నేను వెళ్లలేదు.

Admin

Recent Posts