Hair Cut : హిందూ సంప్రదాయం ప్రకారం.. మంగళవారం రోజు ఎలాంటి శుభకార్యాలు చేయరు. ముఖ్యంగా పురుషులు మంగళవారం రోజు కటింగ్ అస్సలు చేయించుకోరు. అసలు మంగళవారం కటింగ్ చేయించుకోకపోవడానికి కారణాలు ఏంటి.. ఎవరు ఇలా చెప్పారనేది ఇప్పుడు చూద్దాం. వివరాల్లోకి వెళితే.. మంగళవారం రోజు అంగారక గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంగారక గ్రహాన్ని మంగళ గ్రహ్ అని కూడా అంటారు. మంగళవారం పూట ఈ గ్రహ ప్రభావాన్ని మనం ఎక్కువగా గమనించవచ్చు.
ఈ గ్రహం ఎరుపు వర్ణానికి చిహ్నం. ఈ గ్రహం అధిక వేడిని కలిగి ఉంటుంది. మానవ శరీరంపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా.. ఇది రక్తాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుందని చెబుతుంటారు. ఆ రోజున శరీరంపై ఎక్కువగా గాయాలు అవడానికి ఆస్కారం ఉంటుందట. గాట్లు అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉండటం వల్లనే ఆ రోజు కటింగ్ చేసుకోరు. గోర్లు కత్తిరించుకోవడం కూడా చేయకూడదని ఆచారం ఉంది. కాబట్టే.. ప్రతి మంగళవారం రోజున గోర్లు కత్తిరించడం గానీ కటింగ్ చేయించుకోవడం గానీ చేయవద్దంటారు.
అంతేకాకుండా ఆ రోజు కటింగ్ షాపులు సైతం మూసి ఉంచి బార్బర్లు అందరూ సెలవు తీసుకుంటారు. ఇలా మంగళవారం రోజు జుట్టు కత్తిరించుకోకపోవడానికి, గోర్లను తీయకపోవడానికి బలమైన కారణమే ఉంది. అయినప్పటికీ కొందరు మాత్రం ఆ రోజు హెయిర్ కట్ చేయించుకుంటారు. గోర్లను తీస్తారు. కానీ శాస్త్రాలు చెబుతున్న ప్రకారం.. ఆ రోజు అసలు అలాంటి పనులు చేయరాదు. లేదంటే సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.