వైద్య విజ్ఞానం

ఆపరేషన్ తర్వాత వంకాయ తినొద్దని ఎందుకు చెబుతారు?

ఆపరేషన్ చేయించుకోవాల్సినప్పుడు సర్జరీ చేసే రోజు ఉదయం నుంచి ఎలాంటి ఆహారం తీసుకోనివ్వరు వైద్యులు. ఆహారమే కాదు కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనివ్వరు. అంతేకాదు సర్జరీ అయిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతారు. సర్జరీ చేయించుకున్న తర్వాత కచ్చితంగా వంకాయను తినొద్దు అని చెబుతారు వైద్యులు. అయితే ఇలా ఎందుకు చెబుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ఏ వైద్యుడు అయినా సర్జరీ చేసే ముందు లోకల్ అనస్తీషియాను పేషంటుకు ఇస్తారు. దీనివల్ల మ‌త్తు కలిగి పేషెంట్ నిద్రపోతాడు. ఆ సమయములో సర్జరీ చేయడం వలన ఎలాంటి నొప్పి తెలియకుండా ఉంటుంది. అయితే ఇలా లోకల్ అనస్తిషియా ను ఇవ్వడం వల్ల శరీరంలో జీవక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. శరీరం ట్రామాలో పడిపోతుంది. దీనివల్ల అన్ని అవయవాలు స్తబ్దుగా అయిపోతాయి.

do you know why doctors say do not eat brinjal before or after surgery

తిరిగి వెంటనే పనిచేయడానికి సమయం పడుతుంది. ఆ సమయంలో శరీరంలో హిస్టామిన్ లు విడుదల అవుతూ ఉంటాయి. వాటిని తగ్గించడం కోసమే యాంటీ హిస్టామిన్ లు మందులను ఇస్తారు. అయితే వంకాయ హిస్టామిన్ ను విడుదల చేసే పదార్థం. యాంటీ హిస్టమిన్ మందులు వేసుకుంటూ వంకాయ తినడం వలన మందులు పనిచేయవు. అందుకే సర్జరీ సమయంలో వైద్యులు వంకాయ తినకూడదు అని చెబుతారు.

Admin

Recent Posts