వైద్య విజ్ఞానం

ఈ ఉద్యోగాలు చేసే పురుషులూ జాగ్ర‌త్త‌..! సంతానోత్ప‌త్తి అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి..!

సంతానం క‌లగాలంటే స్త్రీ అండంతోపాటు పురుషుని వీర్యం కూడా నాణ్యంగా ఉండాల‌ని అంద‌రికీ తెలిసిందే. స్త్రీల‌కు రుతుక్ర‌మం స‌రిగ్గా వ‌స్తున్న స‌మ‌యంలో నిర్దిష్ట తేదీల్లో పురుషులు క‌లిస్తే అప్పుడు ఆ పురుషుల నుంచి వచ్చే నాణ్య‌మైన వీర్యం స్త్రీ అండాన్ని చేరి అది ఫ‌ల‌దీక‌ర‌ణం చెందుతుంది. తద్వారా పిండం ఏర్ప‌డి శిశువుగా మారుతుంది. అయితే నేటి ఉరుకుల ప‌రుగుల బిజీ యుగంలో పురుషుల వీర్యం అంత నాణ్యంగా ఉండ‌డం లేద‌ట‌. ఇది మేం చెబుతోంది కాదు. టెక్సాస్ యూనివ‌ర్సిటీకి చెందిన సైంటిస్టు బృందం చెబుతోంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు చెప్ప‌బోయే ఆయా ర‌కాల ఉద్యోగాలు చేసే పురుషుల‌కైతే వీర్యం నాణ్యంగా ఉండ‌డం లేదట‌. అంతేకాదు, అందులో శుక్ర క‌ణాల సంఖ్య కూడా త‌క్కువ‌గా ఉంటోంద‌ట‌. ఇంత‌కీ… పురుషుల‌కు ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడుతున్న ఆ ఉద్యోగాలు ఏమిటంటే…

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా ప‌నిచేసే వారు నిత్యం ఎన్నో సంద‌ర్భాల్లో తీవ్ర‌మైన మానసిక ఒత్తిడి ఎదుర్కొంటారు. దీనికి తోడు ఎల్ల‌ప్పుడూ కంప్యూట‌ర్ల‌పై ప‌నిచేయ‌డం వ‌ల్ల వాటి నుంచి విడుద‌ల‌య్యే రేడియేష‌న్ పురుషుల వీర్యంపై ప్ర‌భావం చూపుతుంది. అందుకే ఈ జాబ్ చేసే వారికి వీర్యం త‌క్కువ‌గా ఉండ‌డ‌మే కాదు, ఉన్న వీర్యం కూడా నాణ్యంగా ఉండ‌దు. మొబైల్ ట‌వ‌ర్ టెక్నిషియ‌న్‌గా ప‌నిచేస్తున్న వారిపై రేడియేష‌న్ ప్ర‌భావం అధికంగా ప‌డుతుంది. వీరిలో వీర్యం ఎక్కువగా ఉత్ప‌న్నం అవ‌దు. అయినా అందులో ఉండే శుక్ర క‌ణాలు ఉత్తేజంగా ఉండ‌వు. త‌ద్వారా అది పిల్లలు పుట్ట‌డంపై ప్ర‌భావం చూపుతుంది. మొబైల్ ట‌వ‌ర్స్ లాగే ఎక్స్‌రే మిష‌న్లు కూడా రేడియేష‌న్‌ను విడుద‌ల చేస్తాయి. క‌నుక వీరిలో కూడా వీర్యం త‌క్కువ‌గా, నాణ్య‌త‌లేమితో ఉంటుంది.

men who are in these professions will get no kids

నేవీలో ప‌నిచేస్తున్న వారికి సీ సిక్‌నెస్ కార‌ణంగా వీర్య నాణ్య‌త త‌గ్గుతుంద‌ట‌. అలా అని సైంటిస్టులే చెబుతున్నారు. రెజ్లింగ్ చేసే వారు వేసుకునే బిగుతైన అండ‌ర్‌వేర్ వ‌ల్ల వారి అంగం, వృష‌ణాల‌పై తీవ్ర‌మైన ఒత్తిడి ప‌డుతుంది. దీంతో వారిలో వీర్య నాణ్య‌త త‌గ్గుతుంది. వీర్యం త‌క్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. ఉష్ణోగ్ర‌త ఎక్కువ‌గా ఉండే బాయిల‌ర్లు, మిష‌న‌రీ, ఫ‌ర్నేస్ వంటి వాటి దగ్గ‌ర ప‌నిచేసే వారికి వీర్యం నాణ్యంగా ఉండ‌దు. చాలా త‌క్కువ‌గా ఉంటుంది. సైక్లింగ్ ఎక్కువగా చేసే పురుషుల్లో కూడా వీర్యం త‌గ్గిపోతుంద‌ట‌. ఎందుకంటే వారు సైకిల్‌పై కూర్చున్న‌ప్పుడు సీట్‌కు ఆనే వృష‌ణాల‌పై తీవ్రమైన ఒత్తిడి ప‌డుతుంద‌ట‌. అందుకే వారికి వీర్యం స‌రిగ్గా ఉత్ప‌న్నం కాద‌ట‌. గుర్ర‌పు స్వారీ… ఇది కూడా సేమ్ సైక్లింగ్ లాగే. గుర్రంపై కూర్చున్న వ్య‌క్తుల వృష‌ణాలు ఎప్ప‌టిక‌ప్పుడు ఒత్తిడికి లోన‌వుతుంటాయి. క‌నుక వీరిలో కూడా వీర్యం స‌రిగ్గా ఉత్ప‌త్తి అవ‌దు.

నైట్ షిఫ్ట్ డ్యూటీ చేసే వారిలో తీవ్ర‌మైన ఒత్తిడి ఉంటుంది. దీనికి తోడు సెక్స్‌పై ఆస‌క్తి కూడా ఉండ‌ద‌ట‌. అందుకే వీర్యం కూడా త‌గ్గుతుంద‌ట‌. ప్రయాణాలు ఎక్కువ‌గా చేసే పురుషుల్లో కూడా వీర్యం స‌రిగ్గా ఉత్ప‌త్తి అవ‌ద‌ట‌. ఎందుకంటే అలాంటి వారు స‌రిగ్గా భోజ‌నం చేయ‌రు కాబ‌ట్టి వారిలోనూ వీర్యం విష‌యంలో అలా జ‌రుగుతుంద‌ట‌.

Admin

Recent Posts