హైపో, హైపర్‌ థైరాయిడిజంకు మధ్య తేడాలు.. కన్‌ఫ్యూజ్‌ అవకండి..!

థైరాయిడ్‌లో రెండు రకాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ కొందరు రెండు థైరాయిడ్‌ సమస్యలకు మధ్య తేడాలతో కన్‌ఫ్యూజ్‌ అవుతుంటారు. దానికి ఉండే లక్షణాలు దీనికి చెబుతుంటారు. కానీ నిజానికి రెండూ వేర్వేరు. ఒక థైరాయిడ్‌ సమస్య థైరాయిడ్‌ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వస్తుంది. దీన్నే హైపో థైరాయిడ్‌ అంటారు. ఇంకో థైరాయిడ్‌ సమస్య గ్రంథి మరీ ఎక్కువగా పనిచేయడం వల్ల వస్తుంది. దీన్నే హైపర్‌ థైరాయిడ్‌ సమస్య అంటారు. రెండింటిలోనూ కనిపించే లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయి.

hypothyroidism and hyperthyroidism differences

హైపో థైరాయిడ్‌ సమస్య

సడెన్‌గా బరువు పెరుగుతారు. సంతాన లోప సమస్యలు ఏర్పడుతాయి. స్త్రీలలో రుతుక్రమం సరిగ్గా ఉండదు. బీపీ ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్‌ స్థాయిలు అధికంగా ఉంటాయి. మలబద్దక సమస్య వస్తుంది. చర్మం పొడిగా ఉంటుంది. కీళ్లు వాపులకు గురవుతాయి. నొప్పిగా కూడా ఉంటాయి. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. వెంట్రుకలు పలుచబడి రాలిపోతుంటాయి. చలికి తట్టుకోలేరు. కొన్ని సార్లు గుండె చాలా తక్కువ రేటుతో కొట్టుకుంటుంది.

హైపర్‌ థైరాయిడ్‌ సమస్య

గుండె వేగంగా కొట్టుకుంటుంది. థైరాయిడ్‌ గ్రంథి వాపునకు గురై కనిపిస్తుంది. ఆకలి మరీ ఎక్కువగా ఉంటుంది. నిద్రలేమి సమస్య ఉంటుంది. నిద్ర సరిగ్గా పట్టదు. తరచూ విరేచనాలు అవుతుంటాయి. దృష్టి సమస్యలు వస్తాయి. తల తిరిగినట్లు అనిపిస్తుంది. సడెన్‌గా బరువు తగ్గుతారు.

రెండు థైరాయిడ్‌ సమస్యలూ నిజానికి భిన్నమైన లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల వైద్యులు భిన్నమైన మెడిసిన్లను చికిత్స కోసం అందిస్తారు. కనుక ఈ రెండింటికీ మధ్య తేడాలను, వాటి లక్షణాలను తెలుసుకుంటే మనకు ఉన్న వ్యాధి ఏమిటి ? అనే విషయం సులభంగా అర్థమవుతుంది. దీంతో మనకు అందించే చికిత్స గురించి కూడా వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

Admin

Recent Posts