వైద్య విజ్ఞానం

ఉదయాన్నే లేవగానే మీలో ఈ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..?

గుండెకు శత్రువులు, రక్తపోటు, మధుమేహం. కానీ ఇటీవల కాలంలో ఈ రెండు సమస్యలు లేకపోయినా గుండెపోటు బారిన పడుతున్నారు చాలామంది. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, వ్యాయామం లేకపోవడం. కొన్నిసార్లు మితిమీరిన కసరత్తు ఓ కారణం కావచ్చు. యువతరం గుండె చుట్టూ కాపు కాసిన శత్రువులు ఇవే. అయితే, గుండెపోటు బారినపడి అక్కడికక్కడే మరణించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సరిగ్గా లేని జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, కోవిడ్ వైరస్ కారణంగా గుండె జబ్బులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే స‌రైన జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తే గుండె జబ్బులు కూడా నియంత్రణలో ఉంటాయి. అయితే దీనికోసం లక్షణాలను సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం.

చాలా సందర్భాలలో ఉదయం నిద్ర లేవగానే గుండె జబ్బుల గురించి శరీరం హెచ్చరిస్తుంది. కానీ ప్రజలు దానిని పెద్దగా పట్టించుకోరు. స్థూలకాయం, మధుమేహం లేదా కరోనా తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్నవారు గుండెపోటు లక్షణాలను అసలు విస్మరించకూడదని వైద్యులు అంటున్నారు. గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా సార్లు ఉదయాన్నే ఎక్కువగా ఉంటుందని కార్డియాలజిస్ట్ డాక్టర్ అజిత్ కుమార్ వివరిస్తున్నారు. వైద్యులు దీనిని సిర్కాడియన్ అని పిలుస్తారు. ఉదయాన్నే బిపి కూడా పెరగడం మొదలవుతుంది. దీంతో గుండెపోటు రావచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఈ లక్షణాలు ఉదయం కనిపిస్తే అప్పుడు అప్రమత్తంగా ఉండండి.

if you are facing these symptoms in the morning then beware

చాలాసార్లు ఉదయం పూట చాతిలో మంట, నొప్పి వస్తుందని డాక్టర్ చెబుతున్నారు. చాలా సందర్భాలలో ప్రజలు దీనిని గ్యాస్ సమస్యగా భావిస్తారు. అలా నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు. ఉదయం చాతి నొప్పి ఉంటే ఎడమ చేయి లేదా భుజం వరకు నొప్పి ఉన్న వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. చాలాసార్లు మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే వాంతులు లేదా వికారం సమస్య ఉంటుంది. కానీ ప్రజలు వాంతులను కడుపు సమస్యగా భావిస్తారు. కానీ చాలా సందర్భాలలో ఇది గుండెపోటు లక్షణం కూడా కావచ్చు. ఛాతీ నొప్పి వాంతులు లేదా వికారం సమస్యలు ఉంటే విస్మరించకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన సూచిస్తున్నారు.

Admin

Recent Posts