వైద్య విజ్ఞానం

మ‌ధుమేహం సంకేతాలు ఇవే.. రాక‌ముందు ఈ సూచ‌న‌లు క‌నిపిస్తుంటాయి..!

ప్రాణాన్ని తీసే వ్యాధుల‌లో డ‌యాబెటిస్ కూడా ఒక‌టి అని చెప్ప‌వ‌చ్చు. గాయం క‌నిపించ‌కుండా ఇది మ‌న మ‌ర‌ణానికి కార‌ణం అవుతుంది. రక్తంలో అధిక చక్కెర వల్ల ఈ మధుమేహం వ్యాధి వస్తుంది. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే రోగం. దీన్ని అశ్రద్ధ చేస్తే గుండె, రక్తనాళాలు, కళ్ళు, మూత్రపిండాలు, నరాలు అన్నీ దెబ్బతింటాయి. చివరికి మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. తప్పుడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల మధుమేహం వస్తుంది. అయితే, మధుమేహం శరీరంలో అభివృద్ధి చెందడానికి చాలా సమయం పడుతుంది. కానీ, మనం కాస్త అప్రమత్తంగా ఉంటే ఈ లక్షణాలను గుర్తించవచ్చు. దీనితో పాటు, మధుమేహం ప్రీ-డయాబెటిక్ దశలో రాకుండా నిరోధించవచ్చు.

డ‌బ్ల్యూహెచ్ఓ ప్రకారం, డ‌యాబెటిస్ రెండు ర‌కాలుగా ఉంటుంది. సాధారణంగా రక్తంలో చక్కెరను ప్రాసెస్ చేయలేనప్పుడు , ప్యాంక్రియాస్ తక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేసినప్పుడు , రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నప్పుడు మ‌ధుమేహం వ‌చ్చే ఛాన్స్ వ‌చ్చింది. అయితే రక్తంలో చక్కెరల స్థాయులు నిర్ధారిత మోతాదుకు మించి పెరిగితే మధుమేహం ఉన్నట్లే. కొందరిలో తరచూ ఆయాసం, వాంతులు, విరేచనాలు, చర్మం, మర్మాయవయాల వద్ద ఇన్ఫెక్షన్లు కనిపించవచ్చు. వృషణాలలో దురద. అంగంలో మంటగా ఉండటం. శృంగార కోరికలు సన్నగిల్లడం. చర్మం ముడత పడటం. ప్రీ డయాబెటిస్ ల‌క్ష‌ణాల‌లో మీ మెడ, మోచేతుల్లో, చర్మం నల్లగా మారుతుంది. అలసటగా అనిపిస్తుంది. తగినంత నిద్రపోతున్నప్పటికీ కూడా రోజంతా అలసటగానే ఉంటుంది.

if you have diabetes then these symptoms will show up

తరచూ మూత్ర విసర్జనకు వెళుతూ వస్తూ ఉంటారు. హఠాత్తుగా బరువు పెరిగినట్టు కనిపిస్తారు. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయినట్టు కనిపిస్తారు. ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తే అది ప్రీ డయాబెటిస్ లక్షణాలుగా భావించాలి. రక్తంలో చేరిన గ్లూకోజ్ ను శరీరం సమర్థవంతంగా నిర్వహించలేకపోతుంది. దీనివల్ల అది శరీరంలో పేరుకుపోయి బరువు పెరగడంతో పాటు తీవ్ర అలసట, మూత్ర విసర్జనకు వెళ్లి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మీకు ఇలాంటి సంకేతాలు కనిపించగానే వెంటనే కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. షుగర్ టెస్ట్ ద్వారా మీకు ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నారో లేదా డయాబెటిక్‌గా మారారో తెలుసుకోవచ్చు.ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నవారు, డయాబెటిస్ బారిన పడని వారు జీవనశైలిలో కొద్ది మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా పంచదార అధికంగా వాడిన పదార్థాలను తక్కువగా తినాలి. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్ ను కూడా తక్కువగా తీసుకోవాలి. అంటే బయట దొరికే ప్యాకేజీ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్ ఫుడ్ ను తినకూడదు.

Admin

Recent Posts