ఈ బ్ల‌డ్ గ్రూప్ ఉన్న‌వాళ్ల‌కు హార్ట్ ఎటాక్‌లు ఎక్కువ‌గా వ‌స్తాయట‌.. తెలుసా..?

సాధారణంగా మ‌నం వ్యాయామం చేయకపోతే.. సరైన ఆహారం తీసుకోకపోతే.. ఇతరత్రా కారణాల వల్ల గుండె జ‌బ్బులు వస్తాయని మనకు తెలుసు కానీ.. అసలు.. మీ ఒంట్లో ప్రవహించే రక్తం వల్ల కూడా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ అనే విషయం మీకు తెలుసా. అవును.. మీరు ఫిట్ గా ఉన్నా.. మంచి ఫుడ్ తీసుకుంటున్నా.. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నా.. ఎంతో ఆరోగ్యంగా ఉన్నా కూడా మీ రక్తమే మీకు గుండె జబ్బులు తీసుకొచ్చే ప్రమాదం ఉంద‌ట‌. కొన్ని పరిశోధనల తర్వాత తేలిన విషయం ఏంటంటే.. కొన్ని రకాల బ్లడ్ గ్రూప్ ల వల్ల హార్ట్ ఎటాక్స్ వచ్చే ప్రమాదం ఎక్కువట. మరి.. ఏ బ్లడ్ గ్రూప్ లకు గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ ? వేటికి తక్కువ ? దానికి గ‌ల కారణాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా బ్లడ్ లో చాలా రకాల గ్రూప్స్ ఉంటాయి. A పాజిటివ్, నెగెటివ్, B పాజిటివ్, నెగెటివ్.. AB పాజిటివ్, నెగెటివ్, O పాజిటివ్, నెగెటివ్.. గ్రూపులు ఉంటాయి. వీటిలో O పాజిటివ్ మినహా.. మిగతా అన్ని గ్రూపులకు హార్ట్ ఎటాక్ వచ్చే ముప్పు ఎక్కువ అని పరిశోధనలో వెల్లడైంది. అమెరికన్ హార్ట్ అసోషియేషన్ చేసిన అధ్యయనంలోనే ఈ విషయాలు వెల్లడయ్యాయి. O బ్లడ్ గ్రూప్ కంటే.. A లేదా B బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 8 శాతం ఎక్కువ ఉన్నట్టు తెలింది. గుండె పోటుతో పాటు.. హార్ట్ ఫెయిల్యూర్ సమస్యలు కూడా O గ్రూప్ కంటే.. A గ్రూప్ కు ఎక్కువట.

if you have these blood groups then you will get heart attack

A, B బ్లడ్ గ్రూప్ లకు హార్ట్ ఎటాక్ రిస్క్ ఎందుకు ఎక్కువ అంటే.. O గ్రూప్ కన్నా కూడా.. A, B బ్లడ్ గ్రూప్ వ్యక్తుల్లో రక్తం గడ్డకట్టడం ఎక్కువగా ఉంటుంది. దాన్నే బ్లడ్ క్లాట్స్ అంటారు. అంటే A గ్రూప్ రక్తం కానీ.. B గ్రూప్ రక్తం కానీ.. అధిక సాంద్రతతో ఉంటుంది. దాని వల్ల.. తొందరగా ఈ రక్తానికి గడ్డ కట్టే అవకాశం ఉంటుంది. అలా రక్తం గడ్డ కట్టే ప్రక్రియనే థ్రొంబోసిస్ అంటారు. అలా రక్తం గడ్డ కట్టడం వల్ల.. గుండెకు రక్తం సరఫరా అయ్యే ప్రాంతాన్ని అడ్డగిస్తాయి. దాని వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అయితే.. ఇది నూటిలో కోటిలో ఒక్కరికి మాత్రమే ఇలా జరిగే చాన్స్ ఉంటుంది. అందరికీ జరగాలని లేదు. ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లు అయినా.. ఆరోగ్యంగా ఉంటే వచ్చే సమస్యలు ఏం ఉండవు కానీ.. కొన్ని కొన్ని సందర్భాల్లో రక్తం గడ్డకట్టే విషయంలో మాత్రం A, B గ్రూప్ లకు ప్రమాదం ఎక్కువ. క‌నుక ఈ బ్ల‌డ్ గ్రూప్స్ ఉన్న వాళ్లు జాగ్ర‌త్త‌గా ఉండాలి. దీంతో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.

Editor

Recent Posts