వైద్య విజ్ఞానం

షుగర్ వ్యాధి వచ్చే ముందు కనిపించే 7 లక్షణాలు..ఓ సారి చెక్ చేసుకోండి మీకేమైనా ఉన్నాయా ఇవి!?

చ‌క్కెర‌… దీని గురించి చెబితే చాలు చాలా మందికి గుర్తుకు వ‌చ్చేది తీపి. ఆ రుచి గ‌ల చాక్లెట్లు, బిస్క‌ట్లు, స్వీట్లు, ఇత‌ర తినుబండారాలు ఒక్క‌సారిగా నోట్లో నీళ్లూరింప‌జేస్తాయి. అయితే ఈ ప‌దార్థాలు ఊహ‌కు రాగానే సాధార‌ణంగానే ఎవ‌రికైనా నోట్లో నీళ్లూర‌తాయి. కానీ కొంత మందికి మాత్రం అంత‌కు మించే జ‌రుగుతుంది. అంటే అవి గుర్తుకు రాగానే వాటిని తిన‌కుండా ఉండ‌లేరు. కానీ అలా తిన‌డంలోనూ మ‌నం కొన్ని విష‌యాల‌ను తెలుసుకోవ‌చ్చు. అవేమిటంటే… బాగా ఎక్కువ‌గా తీపి ప‌దార్థాల‌ను తింటుంటే మ‌న శ‌రీరం కొన్ని ల‌క్ష‌ణాల‌ను, సూచ‌న‌ల‌ను మ‌న‌కు తెలియ‌జేస్తుంది. దీంతో ఆ ల‌క్ష‌ణాలు డ‌యాబెటిస్‌కు దారి తీసేందుకు అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి తీపి ఎక్కువ‌గా తినే వారు ఈ ల‌క్ష‌ణాలు ఉంటే జాగ్ర‌త్త ప‌డండి. లేదంటే షుగ‌ర్ వ్యాధి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

తీవ్ర‌మైన అల‌స‌ట‌, నీర‌సం వ‌స్తున్నాయా..? అయితే మీరు తీపి ప‌దార్థాల‌ను బాగా తింటున్నార‌నో, లేదంటే మీ శ‌రీరంలో చ‌క్కెర ఎక్కువ‌గా ఉంద‌నో తెలుసుకోవాలి. ఒక వేళ అలా గ‌న‌క ఉంటే మీకు డ‌యాబెటిస్ వ‌స్తుంద‌ని అర్థం. తీపి పదార్థాల‌ను అదే ప‌నిగా తిన‌డం, వాటిని తిన‌కుండా ఉండ‌లేక‌పోవ‌డం వంటి సూచ‌న‌లు క‌నుక మీకు తెలుస్తుంటే జాగ్ర‌త్త ప‌డాలి. ఎందుకంటే త్వ‌ర‌లో మీకు మ‌ధుమేహం వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. దానికి సూచ‌నే ఈ తీపి అడిక్ష‌న్‌. త‌ర‌చూ జ‌లుబు, ఫ్లూ జ్వరం వ‌స్తుంటే మీరు తీపి బాగా తింటున్నార‌నో, మీ శ‌రీరంలో చ‌క్కెర ఎక్కువ‌గా ఉంద‌నో అర్థం చేసుకోవాలి. చ‌క్కెర ఎక్కువ‌గా ఉంటే శ‌ర‌రీంలో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌నితీరు మంద‌గించి అలా త‌ర‌చూ జ‌లుబు, ఫ్లూ జ్వ‌రం వ‌స్తుంటాయి.

if you have these symptoms then it might be diabetes

భోజ‌నం చేసిన త‌రువాత మ‌త్తుగా, మ‌గ‌త‌గా ఉంటుంటే మీ శ‌రీరంలో చ‌క్కెర మోతాదు ఎక్కువైంద‌ని తెలుసుకోవాలి. త‌గిన విధంగా స్పందించి డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి చికిత్స తీసుకోవ‌డం మంచిది. తీపిగా ఉండే ప‌దార్థాలు త‌ప్ప ఇత‌ర ఏ రుచి ఉన్న ప‌దార్థాలు కూడా అంత‌గా రుచించ‌వు. లేదంటే తినబుద్ధి కావు. ఈ ల‌క్ష‌ణం గ‌న‌క మీకు ఉంటే మీరు తీపికి బాగా అడిక్ట్ అయ్యార‌ని తెలుసుకోవాలి. ఇది క్ర‌మంగా డ‌యాబెటిస్‌కు దారి తీస్తుంది. కాబ‌ట్టి ముందే జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది. శరీరంలో చ‌క్కెర మోతాదు ఎక్కువ అయితే చ‌ర్మంపై దుర‌ద‌లు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలో చ‌ర్మం పొడిగా కూడా మారుతుంది. ఈ ల‌క్ష‌ణాల‌ను గ‌మ‌నిస్తే వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించాలి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అధికంగా ఉంటే ఆక‌లి బాగా అవుతుంది. ఈ క్ర‌మంలో అలాంటి వారు తిండి ఎక్కువ‌గా తిన‌డం ప్రారంభిస్తారు. దీంతో బ‌రువు కూడా అధికంగా పెరుగుతారు. ఒక‌వేళ ఎవ‌రికైనా ఈ సూచ‌న‌లు, ల‌క్ష‌ణాలు ఉంటే వెంట‌నే జాగ్ర‌త్త ప‌డాలి. లేదంటే అది డ‌యాబెటిస్‌కు దారి తీస్తుంది.

Admin

Recent Posts