వైద్య విజ్ఞానం

Diabetes Symptoms : ఈ ల‌క్ష‌ణాలు మీలో ఉన్నాయా.. అయితే షుగ‌ర్ కావ‌చ్చు.. నిర్ల‌క్ష్యం చేస్తే ప్ర‌మాదం..

Diabetes Symptoms : ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకీ వేగంగా పెరుగుతోంది. కొన్ని గణాంకాల ప్రకారం, భారతదేశాన్ని డయాబెటిస్ రాజధాని అని పిలుస్తారు. మధుమేహం అనేది మారుతున్న జీవనశైలి, పోషకాహార లోపం కారణంగా అభివృద్ధి చెందుతున్న వ్యాధి. డయాబెటిస్ అనేది టైప్-1, టైప్-2 అని రెండు రకాలుగా ఉంటుంది. ప్రస్తుతం టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగుల సంఖ్య భారతదేశంలో ఎక్కువగా ఉంది. డయాబెటిస్ వ్యాధిని సరైన సమయంలో నియంత్రించకపోతే, దాని ప్రభావం శరీరంలోని అనేక ముఖ్యమైన అవయవాలపై కూడా కనిపిస్తుంది. డయాబెటిక్ పేషెంట్లలో షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల దీని ప్రభావం కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, కళ్లపై కూడా కనిపిస్తుంది.

ఎవరిలోనైనా ఈ లక్షణాలు కనిపిస్తే క‌చ్చితంగా జాగ్రత్త వహించాలి. డయాబెటిస్ వ్యాధి వచ్చింది అనటానికి కొన్ని సూచనలు కనిపిస్తాయి. అవి ఏంటంటే.. రోగి మరింత అలసిపోయినట్లు, ఎక్కువగా ఆకలి వేయటం, ఎక్కువ దాహంగా అనిపించటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అదేవిధంగా ఎక్కువ సార్లు మూత్రం విసర్జన చేయవలసి వస్తుంది. ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లడం వల్ల డీహైడ్రేషన్ కు లోనవుతారు. డయాబెటిస్ పేషెంట్ల‌ నోటి నుండి దుర్వాసన వస్తుంది. పురుషుల కంటే మహిళలకు మధుమేహం లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

if you have these symptoms then it might be diabetes

మహిళలలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) అనేది ఒక సాధారణ వ్యాధి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం UTI అనేది బ్యాక్టీరియా, వైరస్, ఇన్ఫెక్షన్స్ వలన వచ్చే వ్యాధి. తరచుగా ఈ వ్యాధిలో స్త్రీలు కిడ్నీ, గర్భాశయం లేదా మూత్రాశయం మొదలైన వాటిలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. కొన్నిసార్లు UTI కూడా మహిళల్లో మధుమేహానికి సంకేతంగా ఉంటుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

అదేవిధంగా చాలా మంది తమ నోటిలో తరచుగా తెల్లటి పుండ్లు వస్తున్నాయని ఫిర్యాదు చేస్తారు. నోటిలో తరచుగా తెల్లటి పుండ్లు రావడం కూడా మధుమేహం లక్షణంగా చెప్పవచ్చు. అకస్మాత్తుగా బరువు తగ్గడం లేదా తగ్గడం కూడా మధుమేహం లక్షణమే. ఆడవారిలో బరువు తగ్గడం లేక పెరగడం వలన ఋతుక్రమంలో అడ్డంకులు ఏర్పడతాయి. అంతేకాకుండా చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు ఓవరీస్ లో నీటి బుడగలు ఏర్పడతాయి. అందువలన మహిళలకు నెలసరి అనేది కచ్చితమైన సమయానికి రాదు. ఈ లక్షణాలు కనిపిస్తే క‌చ్చితంగా వైద్యులను సంప్రదించి తగు నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. డయాబెటిస్ ఉన్నవారు మంచి ఆహార నియమాలు పాటిస్తూ రక్తంలో చక్కెర స్థాయిలు ఫాస్టింగ్ లో 110, పోస్ట్ లంచ్ తరువాత 160 – 170 మధ్యలో ఉండేలా చూసుకోవాలి.

Admin

Recent Posts