క్యాన్సర్.. ఇదొక ప్రాణాంతక వ్యాధి.. మన శరీరంలో అనేక భాగాలకు క్యాన్సర్ సోకుతుంది. శరీరంలోని ఆయా భాగాల్లో కణాలు ఒక క్రమ పద్ధతిలో కాకుండా అస్తవ్యస్తంగా పెరిగితే అవి గడ్డలుగా మారి క్యాన్సర్‌కు దారి తీస్తాయి. క్యాన్సర్ వచ్చిందంటే అది ఆరంభంలో ఉందా, చివరి దశలో ఉందా అనే విషయం గుర్తించాలి. ఆరంభంలో ఉంటే క్యాన్సర్ నుంచి చాలా వరకు సేవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే మరి మనకు క్యాన్సర్ వచ్చిందని తెలుసుకోవడం ఎలా ? అందుకు.. శరీరం మనకు కొన్ని లక్షణాలను తెలియజేస్తుంది. వాటిని కనిపెట్టడం ద్వారా క్యాన్సర్ వచ్చిందా, రాలేదా అన్న విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. మరి క్యాన్సర్ వస్తే మనకు కనిపించే లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
జీర్ణాశయంలో రక్తస్రావం, కడుపులో నొప్పి, ఆహారం తీసుకోవటంలో ఇబ్బంది, పేగు కదలికలు సరిగా లేకపోవటం వంటి సమస్యలు క్యాన్సర్ వల్ల వస్తాయి. ఈ సమస్యలు ఉంటే గనక అనుమానించాలి. వెంటనే వైద్య పరీక్షలు చేయించుకుని అవసరం ఉన్న మేరకు చికిత్స తీసుకోవాలి. ఏ కారణం లేకుండా బరువు సడెన్‌గా తగ్గుతుంటే మీరు క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారేమో గుర్తించాలి. క్యాన్సర్ ఉంటే బరువు సడెన్‌గా తగ్గుతారు. కనుక ఇలా ఎవరికైనా అయితే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. చర్మం పైన ఉండే మచ్చలలో సడెన్‌గా మార్పులు వస్తుంటే దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాలి. ఎందుకంటే క్యాన్సర్ ఉంటే చర్మంపై ఉండే మచ్చల పరిమాణం, రంగు తదితరాల్లో మార్పులు వస్తాయి. అవి కూడా సడెన్‌గా వస్తాయి. దీంతోపాటు ఆ ప్రాంతంలో దురదలు వస్తాయి. రక్తస్రావం కూడా అయ్యేందుకు వీలుంటుంది.
శరీరంలో ఎక్కడైనా అసాధారణంగా గడ్డలు వస్తే వాటిని చెక్ చేయించాలి. అవి క్యాన్సర్ కణతులు అయి ఉండవచ్చు. కొన్ని సార్లు కొవ్వు కణతులు కూడా ఏర్పడుతాయి. వాటితో ఇబ్బందేమీ ఉండదు. కానీ క్యాన్సర్ కణతులు అయితే మాత్రం జాగ్రత్త వహించాల్సిందే. కొన్ని రకాల క్యాన్సర్‌ల వల్ల శరీరంలో నిర్దిష్టమైన భాగాల్లో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఉదాహరణకు బోన్ క్యాన్సర్ తీసుకుంటే ఎముకలు నొప్పి పుడతాయి. దగ్గు బాగా ఉందా ? 3 వారాల కన్నా ఎక్కువ సమయం పాటు దగ్గుతో బాధపడుతున్నారా ? అయితే అది ఊపిరితిత్తుల క్యాన్సర్ అయి ఉండవచ్చు. కనుక ఓ సారి చెక్ చేయించుకుంటే మంచిది.
తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకున్నా లేదంటే ఆహారాన్ని మింగే సమయంలో గొంతులో మంట పుట్టినా దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాలి. క్యాన్సర్ కణాలు గొంతులో మంటను కలిగిస్తాయి.